https://oktelugu.com/

తిరుపతిలో దుబ్బాక ఫలితం వస్తుందా..?

ఆలు లేదు.. చూలు లేదు.. కాని కొడుకు పేరు పోమలింగం.. లాగా ఉంది బీజేపీ నాయకులు తీరు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని ఏపీ బీజేపీ నేతలు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారట. గెలిచేసినట్లుగానే ఊహించుకుని సంబరాలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.  దుబ్బాకలో బీజేపీ ప్రధానంగా… అధికార పార్టీపై పోరాడింది. తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన లోక్ సభ స్థానానికి జనవరి తర్వాత ఎప్పుడైనా ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉన్నట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2020 12:43 pm
    Follow us on

    Somu Veerrju

    ఆలు లేదు.. చూలు లేదు.. కాని కొడుకు పేరు పోమలింగం.. లాగా ఉంది బీజేపీ నాయకులు తీరు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని ఏపీ బీజేపీ నేతలు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారట. గెలిచేసినట్లుగానే ఊహించుకుని సంబరాలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.  దుబ్బాకలో బీజేపీ ప్రధానంగా… అధికార పార్టీపై పోరాడింది. తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన లోక్ సభ స్థానానికి జనవరి తర్వాత ఎప్పుడైనా ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    తెలంగాణలో బీజేపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్ర నిధుల గురించి విస్తృత ప్రచారం చేశారు. కేసీఆర్ పథకాలన్నీ కేంద్రం చలువేనన్నారు. గణాంకాలతో సహా బయట పెట్టారు. ఎంత తీవ్రంగా బీజేపీ నేతలు ఎదురుదాడి చేశారంటే.. చివరికి కేసీఆర్ కూడా.. ఆ ప్రచారంపై స్పందించాల్సి వచ్చింది. అప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయింది. బీజేపీకి ఓటు వేసినా.. తమకు పథకాలు ఆగవనే భరోసా లభించింది… ఒక్కరంటే.. ఒక్కరూ చెప్పుకోవడం లేదు. చెప్పుకుంటే.. ఎక్కడ వైసీపీకి క్రెడిట్ తగ్గిపోతుందోనన్నట్లుగా ఉంటున్నారు.

    చివరికి నిన్నటికి నిన్న జగన్ ప్రారంభించిన అభయం ప్రాజెక్ట్ కు కేంద్రం అరవై శాతం నిధులు ఇస్తోంది. కానీ ఒక్క బీజేపీ నేత కూడా చెప్పుకోవడానికి సాహసించడం లేదు. తెలంగాణ బీజేపీ నేతలు… ప్రభుత్వంపై పోరాడే వారికి.. ప్రోత్సాహం ఇచ్చారు. అంతర్గత రాజకీయాలతో ఒకరినొకరు తొక్కేయాలని అనుకోలేదు. అందులో రఘునందన్ రావు లాంటి నేతలు బయటకు వచ్చారు. ఆయన ఒకప్పుడు టీఆర్ఎస్ నేతే. కానీ.. ఎక్కడా తగ్గలేదు. ఆయనే కాదు.. ప్రభుత్వంపై సిన్సియర్‌గా పోరాడేవారందరికీ.. నేతలు భరోసా ఇచ్చారు. తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని సోము వీర్రాజు ప్రకటించారు. ఆయన ప్రకటనను కొందరు బీజేపీది అతివిశ్వాసం అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక తరువాత ఏదేదో ఊహించుకుంటూ తిరుపతి స్థానాన్ని కూడా గెలుస్తామని భ్రమ పడుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు.

    కానీ సోము వీర్రాజుది అతి విశ్వాసం కానేకాదు. పగటి కల కూడా కాదు. వాస్తవం.తిరుపతి ఉప ఎన్నిక జరిగితే బీజేపీ గట్టిపోటీ ఇవ్వడం ఖాయం. దానికి కారణం అక్కడ బీజేపీ బలం కాదు. బీజేపీకి. టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ ఇంకా అవసరమైతే బీఎస్పీ తదితర పార్టీలు బీజేపీ గెలుపుకు తీవ్రంగా కృషిచేసే అవకాశం ఉంది. ఎట్లాగూ జనసేనకు బీజేపీతో ఒప్పందం ఉంది కాబట్టి జనసేన ఎలాగూ బీజేపీ గెలుపుకు కృషిచేస్తుంది. తిరుపతి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా తెలియకపోయినా బీజేపీని చాలా బలమైన అభ్యర్థిగా ఎల్లోమీడియా ఫోకస్‌ చేస్తోంది. దీంతో ఇక్కడ వైసీపీకి బీజేపీ గట్టి పోటీనివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.