https://oktelugu.com/

Drugs Case In Telangana: మళ్లీ తెలంగాణలో డ్రగ్స్ కలకలం

Drugs Case In Telangana: తెలంగాణ రాష్ర్టంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోంది. ఫలితంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం విస్తరిస్తోంది. దీంతో గతంలోనే పలువురిని అరెస్టు చేసినా రాజకీయ ప్రోద్బలంతోనే కేసు కొలిక్కి రాకుండా పోయింది. ఈ క్రమంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా విస్తరించింది. దీంతో డ్రగ్స్ మాఫియా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు మాత్రం హైదరాబాద్ లో దొరకడం సంచలనం రేపుతోది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియాపై […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 27, 2022 / 11:32 AM IST
    Follow us on

    Drugs Case In Telangana: తెలంగాణ రాష్ర్టంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోంది. ఫలితంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం విస్తరిస్తోంది. దీంతో గతంలోనే పలువురిని అరెస్టు చేసినా రాజకీయ ప్రోద్బలంతోనే కేసు కొలిక్కి రాకుండా పోయింది. ఈ క్రమంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా విస్తరించింది. దీంతో డ్రగ్స్ మాఫియా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు మాత్రం హైదరాబాద్ లో దొరకడం సంచలనం రేపుతోది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం కూడా ఉక్కు పాదం మోపాలని చూస్తోంది.

    Drugs Case In Telangana

    ఇందుకు గాను సమర్థులైన పోలీసుల సేవలను వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లను ఉపయోగించుకుంటోంది. వీరి సాయంతో డ్రగ్స్ మాఫియా మూలాలు హైదరాబాద్ లో లేకుండా చేయాలనేదే సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో పాత నేరస్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. వారి ద్వారా కీలక సమాచారం సేకరిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి సహకరించేదెవరు? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

    హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ కేసులో మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇటీవల టోనీ అనే డ్రగ్స్ సరఫరా చేసే వాడిని పట్టుకుని ఆరా తీస్తున్నారు. దీంతో మొత్తం డ్రగ్స్ వాడే వారి సంఖ్యను తయారు చేస్తున్నారు. దీంతో చాలా మంది జాతకాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో బడాబాబుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే గతంలోనే ఈ కేసు తాలూకు విషయాలు వెలుగు చూసినా రాజకీయ ప్రోద్బలంతో కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు డ్రగ్స్ మాఫియా మొత్తం జాతకం ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లనుంది.

    డ్రగ్స్ వ్యాపారంలో మొత్తం కోట్లలో దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నా ముఖ్యమైన వ్యక్తులు పరారీలో ఉన్నట్లు సమాచారం. దీంతో సర్కారు కూడా పట్టుదలతోనే ఉంది. డ్రగ్స్ మాఫియా మూలాలు దెబ్బతీసి డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే డ్రగ్స్ వ్యాపారం చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు.

    Also Read: తెలంగాణలో మొదలైన కరోనా కల్లోలం..రోజుకు ఎన్ని కేసులంటే?

    డ్రగ్స్ మాఫియాలో పలువురు వీఐపీలు ఉన్నట్లు సమాచారం. దీంతో వారిని కూడా బయటకు రప్పించి కేసులు నమోదు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ డ్రగ్స్ మాఫియాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీని నిర్మూలనకు నడుం బిగించినట్లు తెలుస్తోంది. అందుకే డ్రగ్స్ తీసుకునే వారు ఎంతటి వారయినా ఉపేక్షేది లేదని చెబుతున్నారు.

    ఈ నేపథ్యంలో ఈనెల 28న ప్రగతిభవన్ లో డ్రగ్స్ నియంత్రణపై పోలీస్, ఎక్సైజ్ శాఖలతో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ర్టంలో డ్రగ్స్ మాఫియాను తుదముట్టించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ కోసం పటిష్ట యంత్రాంగాన్ని నియమిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక రాష్ర్టంలో డ్రగ్స్ మాఫియా ఉండొద్దనే సంకల్పం ప్రభుత్వంలో వచ్చింది.

    Also Read: ఎన్నికలకు ప‌క్కా వ్యూహం.. జిల్లాలకు కొత్త బాసులు.. కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌..

    Tags