https://oktelugu.com/

డ్రగ్స్ కేసు:మంత్రి కుమారుడికి లుక్ ఔట్ నోటీసు  

డ్రగ్స్ కేసు శాండిల్ వుడ్ ను అతలాకుతలం చేస్తోంది. కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు, సినీ ప్రముఖులకు డ్రగ్స్ అలవాటు ఉందన్న విషయం తేలిపోవడం కలకలం రేపింది. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో సినీ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన, రియల్టర్ రాహుల్ థాన్స్, ఆర్డీవో క్లర్క్ బి.కే రవిశంకర్ లు అరెస్ట్ అయ్యారు.  ఇప్పటివరకు 13మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఏడుగురికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. Also Read: సుశాంత్ కేసులో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 / 04:08 PM IST

    Drugs

    Follow us on


    డ్రగ్స్ కేసు శాండిల్ వుడ్ ను అతలాకుతలం చేస్తోంది. కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు, సినీ ప్రముఖులకు డ్రగ్స్ అలవాటు ఉందన్న విషయం తేలిపోవడం కలకలం రేపింది. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో సినీ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన, రియల్టర్ రాహుల్ థాన్స్, ఆర్డీవో క్లర్క్ బి.కే రవిశంకర్ లు అరెస్ట్ అయ్యారు.  ఇప్పటివరకు 13మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఏడుగురికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

    Also Read: సుశాంత్ కేసులో బాలీవుడ్ స్టార్లు, తెలుగు హీరో భార్య?

    బెంగళూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులను ఈ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత వారితో కర్ణాటక సినీ ఇండస్ట్రీకి లింకులు బయటపడ్డాయి. కన్నడ సినీ నటులకు, గాయకులకు ఈ నిందితులు డ్రగ్స్ సరఫరా చేసినట్టు నిర్ధారణ అయ్యింది.

    తాజాగా ఈ డ్రగ్స్ కేసులో కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వాపై సెంట్రల్ క్రైం బ్రాంచ్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసు బయటపడగానే ఆదిత్య అల్వా పరార్ అయ్యాడు. అరెస్ట్ ను తప్పించుకునేందుకు ఆదిత్య ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉండడంతో అప్రమత్తమైన సెంట్రల్ క్రైం బ్రాంచ్ దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది.

    Also Read: మోదీ సర్కార్ స్కూల్, కాలేజ్ ఫీజుల కోసం 11 వేలు ఇస్తోందా..?

    ఇక డ్రగ్స్ కేసులో ఇప్పటికే పోలీసులు క్రీడా ప్రముఖులతోపాటు కొంతమంది టెలివిజన్, సినీ కళాకారులను విచారణకు పిలిచారు. అయితే ఎవరినీ ఇంకా అరెస్ట్ చేయలేదు. కేసులో 67మందికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.