https://oktelugu.com/

వైరల్ ఫొటో: ఇలా ఉన్నాడేంటి? మాసిన గడ్డంతో పవర్ స్టార్

చిత్రసీమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లోనూ.. సినిమాల్లోనూ బీజీగా గడుపుతున్నారు. ఆయనకు సంబంధించిన ఏ విషయం బయటికి వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటోంది. తాజాగా పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీంతో అభిమానులంతా ఓ సాంబా.. ఈ ఫొటో ఎప్పటిదో చెప్పుకో అంటూ కామెంట్లు చేస్తూ ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. Also Read: ‘బుర్రిపాలెం’ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 / 04:10 PM IST
    Follow us on

    Pawan-Latest-Unseen-Pic-Goes-Viral-In-Social-Media-1600751294-114

    చిత్రసీమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లోనూ.. సినిమాల్లోనూ బీజీగా గడుపుతున్నారు. ఆయనకు సంబంధించిన ఏ విషయం బయటికి వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటోంది. తాజాగా పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీంతో అభిమానులంతా ఓ సాంబా.. ఈ ఫొటో ఎప్పటిదో చెప్పుకో అంటూ కామెంట్లు చేస్తూ ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు.

    Also Read: ‘బుర్రిపాలెం’ మనసు గెలిచిన మహేశ్‌ బాబు

    పవన్ కల్యాణ్ పాత ఫొటో ఒకటి  ప్రస్తుతం సోషల్ మీడియాలో  ట్రెండింగ్ అవుతోంది. పవన్ టీనేజీ రోజుల్లో దిగిన ఫొటోగా అర్థమవుతోంది. ఇందులో పవన్ కల్యాణ్ షార్ట్ హెయిర్  లుక్కుతో.. హాఫ్ హాండ్స్ షర్ట్ వేసుకొని కన్పిస్తున్నాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కుతోపాటు నెరసిన గడ్డంతో ఆకట్టుకుంటున్నాడు. ‘ఖుషీ’ లేదా ‘కొమురం పులి’ సినిమా టైంలో తీసిన ఫొటో అయివుంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

    పవన్ కల్యాణ్ ఖుషీ సినిమాలోనే ఇలాంటి ఫోజులో ఉన్న ఒక ఫొటో అప్పట్లో బాగా ఫేమస్ అయింది. దీంతో ఇది ఖుషీ సినిమా టైంలో తీసి ఉండొచ్చని పలువురు అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పటితో పోలిస్తే పవన్ ఈ ఫొటోలో కాస్తా లావుగా.. బుగ్గలతో కన్పిస్తున్నాడు. షార్ట్ హెయిర్.. మసినగడ్డంతో ఉన్నాడు. కొమురం పులి టైంలో పవన్ షార్ట్ హెయిర్ తో కన్పించాడు. దీంతో ఈ ఫొటో కొమురంపులి టైంలో తీసి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు.

    Also Read: సుశాంత్ కేసులో బాలీవుడ్ స్టార్లు, తెలుగు హీరో భార్య?

    పవన్ కల్యాణ్ కు సంబంధించిన పాతఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండింగులోకి వస్తున్నాయి. ఇటీవలే పవన్ ఐదేళ్ల నాటి ఫొటో నెట్టింట్లో హల్చల్ చేసింది. పవన్ నిక్కరేసుకుని స్నేహితులతో కలసి నిలుచున్న ఫోటోను మెగాస్టార్ చిరంజీవి ట్వీటర్లో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది. ఆ తర్వాత పవన్ టీనేజీలో ఉన్న ఒక ఫొటో ట్రెండ్ అయింది. తాజాగా పవన్ మసినగడ్డంతో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటో ఎప్పటిదో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతుండటంతో పవన్ టీనేజ్ ఫొటో మరోసారి వైరల్ గా మారుతోంది.