Amit Shah: అమిత్ షా సైతం డ్రగ్స్ పై పడ్డాడే.. షాక్ జగన్ కా? ఉద్దవ్ ఠాక్రేకా?

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వినియోగం గురించి తన మనసులోని మాటలను బయట పెట్టారు. కానీ గంజాయి వినియోగంపై ఏపీలో ప్రతిపక్షాలు దుమారం చేస్తున్న నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మత్తు పదార్థాల వాడకంతో ప్రజల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని తెలిసిందే. దీనిపై అమిత్ షా ఏపీ, మహారాష్ర్టలను టార్గెట్ చేసుకుని […]

Written By: Srinivas, Updated On : November 15, 2021 12:30 pm
Follow us on

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వినియోగం గురించి తన మనసులోని మాటలను బయట పెట్టారు. కానీ గంజాయి వినియోగంపై ఏపీలో ప్రతిపక్షాలు దుమారం చేస్తున్న నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మత్తు పదార్థాల వాడకంతో ప్రజల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని తెలిసిందే. దీనిపై అమిత్ షా ఏపీ, మహారాష్ర్టలను టార్గెట్ చేసుకుని ఈ విధంగా మాట్లాడినట్లు పలువురు విశ్లేషకుల వాదన.

ఎక్కడ డ్రగ్స్, గంజాయి పట్టుబడినా వాటి మూలాలు ఏపీ, మహారాష్ర్టలోనే బయటపడటం తెలిసిందే. దీంతో ఇటీవల బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయి జైలు శిక్ష కూడా అనుభవించిన సంగతి విధితమే. దీంతో డ్రగ్స్ వినియోగంపై అమిత్ షా వ్యాఖ్యలపై అందరిలో ఉత్కంఠ ఏర్పడుతోంది.

మహారాష్ర్ట సీఎం ఉద్దవ్ ఠాక్రే డ్రగ్స్ వినియోగాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టడం లేదని అమిత్ షా మాటల్లో అర్థమవుతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు కూడా పరోక్షంగా హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్, గంజాయి రవాణాపై స్టేట్లు కూడా పట్టించుకుని వాటిని అడ్డుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేసినట్లు సమాచారం.

Also Read: ఆయుష్‌ మంత్రిత్వశాఖలో ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

మత్తు పదార్థాల రవాణా నిరోధంపై ఏ రకమైన చర్యలు ఉండకపోవడంతో యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం స్టేట్లు కూడా పటిష్టమైన యంత్రాంగాన్ని నియమించుకుని తద్వారా అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం. మాదక ద్రవ్యాల వినియోగంపై రాష్ర్ట ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. యువతను నిర్వీర్యం చేసే డ్రగ్స్ వాడకంపై చట్టాలను సమర్థవంతంగా అమలు చేసి నిరోధించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.

Also Read: Maharashtra News: బాలికపై 400 మంది అత్యాచారం.. మహారాష్ర్టలో చోటుచేసుకున్న దారుణం

Tags