https://oktelugu.com/

భారతీయులకు గుణపాఠం చెప్పిన ట్రంప్

ఏదైనా ఓ స్థాయి వరకు చేస్తే అది అందరికీ మంచిది. వ్యాపారం కోసమో.. ఉద్యోగాల కోసమో ఒక దేశం వెళ్లి బుద్దిగా పనిచేసుకుంటే ఎవరూ కాదనరు. కానీ వారినే శాసించాలనుకుంటే పరిస్థితి ఇలానే తిరగబడుతుంది. అమెరికాలో ఇప్పుడు భారతీయులు సహా విదేశీయులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలుపులు మూసేశాడు. వీసాలను నిషేధించి అమెరికా ఆశలు పెంచుకున్న భారతీయుల కలలు కల్లలు చేశాడు. ప్రపంచంలోనే టెక్నాలజీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ కు సీఈవోలు మన భారతీయులు. అందుకే ట్రంప్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 24, 2020 / 06:42 PM IST
    Follow us on


    ఏదైనా ఓ స్థాయి వరకు చేస్తే అది అందరికీ మంచిది. వ్యాపారం కోసమో.. ఉద్యోగాల కోసమో ఒక దేశం వెళ్లి బుద్దిగా పనిచేసుకుంటే ఎవరూ కాదనరు. కానీ వారినే శాసించాలనుకుంటే పరిస్థితి ఇలానే తిరగబడుతుంది. అమెరికాలో ఇప్పుడు భారతీయులు సహా విదేశీయులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలుపులు మూసేశాడు. వీసాలను నిషేధించి అమెరికా ఆశలు పెంచుకున్న భారతీయుల కలలు కల్లలు చేశాడు.

    ప్రపంచంలోనే టెక్నాలజీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ కు సీఈవోలు మన భారతీయులు. అందుకే ట్రంప్ వలసలు నిషేధించగానే గూగుల్ సీఈవో ఖండించారు. ట్రంప్ నిషేధించినా తాము నిపుణులైన వలసవాదులకు ఖచ్చితంగా ఉద్యోగాలిస్తామని.. వలసలతోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంతలా ఎదిగిందన్నారు. నిజానికి ఈ మాటలు అమెరికన్లకు రుచించలేదు. ఆయన అమెరికన్ లా వారి కోణంలో ఆలోచించలేదు.

    చైనాతో ఫైట్.. మోడీనే సరైనోడా?

    అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కరోనా, ఆర్థిక మాంద్యంతో కునారిల్లుతోంది. అందుకే పెరిగిన నిరుద్యోగం అరికట్టడానికి ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయిన 4 కోట్ల మందికి వాటిని ఇవ్వడానికి ట్రంప్ వలసలను నిషేధించారని అంటున్నారు. హెచ్1బీతో పాటు విదేశీ వర్క్ వీసాలను ఈ ఏడాది చివరి వరకూ ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా నిర్ణయంతో కొత్తగా 5.25 లక్షల మంది అమెరికన్లకు తక్షణం ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వైట్ హౌస్ తెలిపింది.

    ట్రంప్ నిర్ణయాన్ని కార్పొరేట్ కంపెనీలు, ప్రతిపక్షాలు, ప్రజాప్రతినిధులు, వ్యాపార, వాణిజ్య సంఘాలు తప్పుపట్టాయి. ఎందుకంటే అమెరికన్లు తక్కువ జీతాలకు, కష్టమైన పనులు చేయరు. విదేశీయులైన భారత్, చైనా వారు తక్కువ జీతాలకు ఎక్కువ పనిచేస్తారు. పని చేసే సామర్థ్యం అమెరికన్లకు లేకపోవడం, వారు ఆ ఉద్యోగాల్లోకి రావడానికి ఇష్టపడకపోవడం కూడా ఈ కార్పొరేట్ కంపెనీ యజమానుల్లో ఆందోళన పెంచుతోంది. అందుకే ట్రంప్ నిర్ణయాన్ని వారంతా వ్యతిరేకిస్తున్నారు.

    భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?

    భారత ప్రభుత్వం, ప్రజల సొమ్ముతో దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు చదువుకొని మన దేశం కోసం కష్టపడకుండా..మన అభివృద్ధికి సోపానంగా నిలవకుండా చాలామంది నిపుణులైన టెకీ విద్యార్థులు డాలర్ల వేట పడి అమెరికా చెక్కేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నారు. కానీ వారి వల్ల మన భారతదేశానికి రూపాయి ఆదాయం లేదు. అదే వారంతా భారత బాగు కోసం పనిచేస్తే దేశం ఇప్పుడు ఓ రేంజిలో ఉండేది. కానీ డాలర్ల వేట మన భారతీయులకు పిచ్చిగా పట్టింది. దేశం విడిచి విదేశాలకు పోయేలా చేసింది. ఇదే అక్కడి దేశాల్లోని ప్రజలకు ఉద్యోగ, ఉపాధిని దూరం చేసింది.

    కానీ ట్రంప్ ఇప్పుడు విదేశీయులతో తమ దేశంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారని గ్రహించి వలసలు నిషేధించాడు. ఏడాది పాటు ఇలాగే కంటిన్యూ చేయనున్నాడు. తద్వారా అమెరికా ఆశలతో ఊరేగే భారతీయులు ఇప్పుడు భారత్ లోనే ఉద్యోగాలు వెతుక్కోవాలి. వారి ఆలోచన సామర్థ్యాలు స్వదేశం కోసం వెచ్చించాలి. తద్వారా దేశం బాగుపడుతుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాకే కాదు.. భారత్ కు లాభదాయకమే. మనోళ్ల డాలర్ల వేటకు చెక్ పడినట్టే..

    -నరేశ్ ఎన్నం