Homeఅంతర్జాతీయంDonald Trump: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ హిందుత్వ అజెండా.. అసలేంటి ఫార్ములా? వర్కవుట్ అవుతుందా?

Donald Trump: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ హిందుత్వ అజెండా.. అసలేంటి ఫార్ములా? వర్కవుట్ అవుతుందా?

Donald Trump: హిందుత్వ అజ్జెండా.. దీనిని బీజేపీ అజెండా అని కొందరు, మోదీ అజెండా అని మరికొందరు.. ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా అని ఇంకొందరు ప్రచారం చేస్తుంటారు. ప్రస్తుతం మారుతున్న రాజకీయా పరిణామాలతో హిందుత్వ ఎజెండా రాజకీయాల్లోల కీలకంగా మారింది. అయితే కొంతమంది ఈ ఎజెండా మాటున ఒక వర్గాన్ని టార్గెట్‌ చేస్తుంటే మరికొందరు లౌకిక ఎజెండా పేరుతో హిందు వ్యతిరేకతను పెంచి పోషిస్తున్నారు. అరాచకశక్తులకు ఊతమిస్తున్నారు. ఏది ఏమైనా పదేళ్లుగా ఈ రెండు అజెండాలతోనే దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. విచ్ఛిన్న శక్తులు, సమైక్య శక్తుల పేరిటీ పార్టీలు విడిపోయి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. పదేళ్లుగా హిందుత్వ అజెండానే పైచేయి సాధిస్తోంది. ఇందుకు ప్రధానకారణం అరాచక శక్తులను కట్టడి చేసే సత్తా ఒక్క బీజేపీకే ఉందని దేశంలో మెజారిటీ ప్రజలు నమ్ముతుండడమే. దీంతో గడిచిన రెండు ఎన్నికల్లో మెజారిటీ ప్రజల ఓట్లు గంప గుత్తాగా బీజేపీ కూటమికి పడ్డాయి.

అమెరికాలో ఇదే అజెండా..
భారత్‌లో సక్సెస్‌ఫుల్‌గా బీజేపీని అధికారంలోకి తీసుకువస్తున్న ఈ అజెండాతోనే త్వరలో అమెరికా ఎన్నికల బరిలో దిగాలని అమెరికా మాజీ అధ్యోఉడు డోనాల్డ్‌ ట్రంప్‌ భావిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ తరహాలో హిందూత్వ మార్గాన్నే అనుసరించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ముస్లిం వ్యతిరేక భావాలను ప్రచారం చేసుకోవడం ద్వారా.. దేశంలోని ప్రజల ఓట్లను గంపగుత్తగా పొందడం సాధ్యం అవుతుందని ట్రంప్‌ ఆలోచనగా కనిపిస్తోంది. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ముస్లిం దేశాల నుంచి అమెరికాకు పౌరుల రాకపోకలపై నిషేధాన్ని పునరుద్ధరిస్తానని డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. రిపబ్లికన్‌ యూదు కూటమి సమావేశంలోనే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.

తన హయాంలో ఆ దేశాలపై ఆంక్షలు..
ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్, ఇరాక్, సూడాన్‌ వంటి దేశాలకు చెందిన మామూలు ప్రజలు కూడా అమెరికాలో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించారు. బైడెన్‌ వచ్చాక వాటిని ఎత్తివేశారు. అందుకే ఆయన .. ‘ప్రయాణ నిషేధం మీకు గుర్తుందా? నేను రెండోసారి అధ్యక్షుడైన తొలిరోజే.. ఆ నిషేధాన్ని పునరుద్ధరిస్తా. మనదేశంలో బాంబుపేలుళ్లు ఇష్టపడేవాళ్లు మనదేశంలో అడుగుపెట్టవదు’్ద అని ట్రంప్‌ అంటున్నారు.

ఆ మతం వారే ఉగ్రవాదులుగా..
ముస్లిం మతానికి చెందిన వారు అంటేనే ఉగ్రవాదులుగా ప్రొజెక్ట్‌ చేయడానికి ట్రంప్‌ చూస్తున్నట్లు కనిపిస్తోంది. అచ్చంగా ఇలాంటి ప్రయత్నమే భారతదేశంలో కూడా జరుగుతోంది. హిందూత్వ ఎజెండాతో ప్రచారం బలంగా జరుగుతోంది. అయితే మెజారిటీ భారతీయులు దీనిని నమ్ముతున్నారు. అందుకే మోదీ సక్సెస్‌ సాధిస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత లేదు. మళ్లీ మళ్లీ గెలుస్తున్నారు.

ఇప్పుడు ట్రంప్‌ కూడా మోదీ తరహాలోనే అమెరికాలో కూడా ముస్లిం వ్యతిరేకతను పెంచాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. మరి ట్రంప్‌ హిందుత్వ అజెండా కాదు కాదు.. ముస్లిం వ్యతిరేక అజెండా అమెరికన్లను ఏమేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version