Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక భారీ ఒప్పందం కుదిరింది. ఖతార్ దేశం అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్‌తో ఏకంగా 200 బిలియన్ డాలర్ల విలువైన విమానాల కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ ఒప్పందంలో 160 విమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
దోహాలో జరిగిన ఈ ఒప్పంద సంతకాల కార్యక్రమంలో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని, ట్రంప్‌తో పాటు బోయింగ్ సీఈఓ కెల్లీ ఓర్ట్‌బర్గ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓర్ట్‌బర్గ్ తనకు చెప్పిన దాని ప్రకారం.. ఇది బోయింగ్ చరిత్రలోనే అతిపెద్ద విమానాల ఆర్డర్ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇది చాలా మంచి వార్త అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : ఈ గల్ఫ్ దేశాల విలాసం ముందు అమెరికా వేేస్ట్ అట.. నివ్వెరపోయిన ట్రంప్
డ్రోన్ ఒప్పందాలు కూడా
అల్– షారాతో భేటీ అనంతరం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సిరియా అధ్యక్షు డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఆకర్ష ణీయంగా కనిపిస్తున్న అందమైన యువకుడు అంటూ కొనియాడారు. బలమైన వ్యక్తి, ఫైటర్ అంటూ శ్లాఘించారు. సిరియాపై ఆంక్షలు రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సిరియా ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తమ కు మంచి రోజులు వచ్చా యని ఆనందం వ్యక్తంచేశారు. అస్సద్ ప్రభుత్వ హయాంలో తిరుగుబాటు నాయకుడిగా గుర్తింపు పొందిన అల్–షారాను అమెరికా ప్రభుత్వం 2013లో అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఆయనపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. అదే అల్–షారా అధ్యక్షుడు కావడం, డొనల్డ్ ట్రంప్ ఆయనతో భేటీ కావడం విశేషం.
ఖతార్ ఎమిర్‌తో రెండు గంటల పాటు చర్చలు జరిపిన తర్వాత, అమెరికా నుండి MQ-9B డ్రోన్‌ల కొనుగోలుతో సహా పలు రక్షణ ఒప్పందాలపై కూడా ట్రంప్ సంతకం చేశారు. ట్రంప్ గల్ఫ్ పర్యటనలో మొదటిగా సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లారు. అక్కడ ఆయన సిరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు.
Also Read : పాక్ శక్తివంతమైనదా: ట్రంప్ కు ఏమైనా మతి పోయిందా?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దోహా ఎయిర్ పోర్టు నుంచి ట్రంప్ ప్రెసిడెన్షియల్ మోటర్‌కేడ్‌ను టెస్లా రెండు ప్రత్యేకంగా రూపొందించిన సైబర్‌ట్రక్ కార్లు ముందుండి నడిపించాయి. టెస్లా అనేది అమెరికా అధ్యక్షుడికి సన్నిహితుడైన ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ.
ట్రంప్ కోసం ‘ఎగిరే ప్యాలెస్’ విమానం
ఖతార్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ కోసం కొత్త ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగించడానికి 400 మిలియన్ డాలర్ల విలువైన ఒక విలాసవంతమైన జెట్‌ను అందించనుంది. ఖతార్ ఎయిర్‌వేస్ ఉపయోగించే మార్పులు చేసిన బోయింగ్ 748 విమానాన్ని దాని విలాసవంతమైన ఇంటీరియర్‌ల కారణంగా రాజ కుటుంబీకుల కోసం ఒక “ఎగిరే ప్యాలెస్” అని పిలుస్తారు. ఈ విమానంలో ఒక బెడ్‌రూమ్ సూట్, బోర్డ్‌రూమ్‌లు, లాంజ్‌లు, పాలరాతితో చేసిన బాత్‌రూమ్‌లు, ఒక పెద్ద మెట్ల దారి ఉన్నాయి. ట్రంప్ దానిని పొందిన తర్వాత, అది సురక్షితమైన కమ్యూనికేషన్ సెటప్‌లు, సీక్రెట్ అంశాలతో అమర్చబడుతుందని నివేదికలు చెబుతున్నాయి. తన పదవీ కాలం ముగిసే వరకు ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ వన్‌గా వాడుకుంటానని చెప్పారు.