
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది. రాష్ర్టం అప్పుల్లో కూరుకుపోయింది. భవిష్యత్తు అంధకారమవుతోంది. ఎటు చూసినా ఎడారే కనిపిస్తోంది. ఆదుకునే వారు కనిపించడం లేదు. అయిన వారు తోడు రావడంలేదు. ఈ నేపథ్యంలో ఏపీని గట్టెక్కించడం అంటే మామూలు విషయం కాదు. దొరికన కాడల్లా అప్పులు చేసి హలో లక్షణా అంటూ ఉసూరుమంటున్నారు. కేంద్రం కూడా తన వల్ల కాదని చేతులెత్తేసింది. ఈ పరిస్థితుల్లో రాష్ర్టం ఏ మేరకు బతికి బట్టకడుతుందో అనే ఆలోచన అందరిలో వ్యక్తమవుతోంది. మొత్తం సంక్షేమ పథకాల పేరుతో నిధులు దండిగా మళ్లించడంతో ఇప్పుడు ఎటు పాలుపోని పరిస్థితి.
ప్రభుత్వం ఇంకా మూడేళ్లు నడపాలి. అంటే నిధులు సమకూరాలి. ఇక్కడ చూస్తే రూపాయి కూడా లేదు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడంతోనే సరిపోతోంది. ఇప్పటికి అప్పులన్ని అలాగే ఉండిపోయాయి. ఆదాయం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఫలితంగా ఏపీ ఆర్థికంగా బలహీనపడిపోయింది. దీంతో భవిష్యత్ తరాలు సైతం కష్టపడే సూచనలే కనిపిస్తున్నాయి. కరోనా కస్టకాలంలో సైతం సంక్షేమ పథకాలు అమలు చేశామని గొప్పలు చెప్పుుకోవడమే తప్ప ఏమి మిగలలేదు. వైసీపీకి ఇక ముందుంది ముసళ్ల పండగ అనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది.
ఇటీవల రాష్ర్ట ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ నేతలను కలిసి వారి పరిస్థితిని వివిరించి ఆదుకోవాలని కోరారు. కానీ వారు అభయం ఇవ్వలేదు. దీంతో ఆ దారులు కాస్త మూసుకుపోయినట్లేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీని గట్టెక్కించేవారే కనిపించడం లేదు. నిధులు ఇలా ఖర్చు చేస్తే ఎలా రాబడి అనే ప్రశ్న సగటు పౌరుడిలో మెదులుతోంది. సంక్షేమ పథకాల పేరుతో దోచిపెడుతుంటే ఆదాయం ఎలా వస్తుంది అని ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
రాబోయే రోజుల్లో రూపాయి కూడా అప్పు దొరకదు అని చెబుతున్నారు. ఏపీ తనకున్న రుణపరిమితిని ఏనాడో దాటేసింది. రెండేళ్లలో పాలనాపరమైన వైఫల్యాలతో ఆదాయాలు కూడా దారుణంగా పడిపోయాయి. ఇంకా మూడేళ్లు మిగిలే ఉంది. దీంతో మూడేళ్లు ఎలా నెట్టుకురావాలనే దానిపైనే వైసీపీ సర్కారు తర్జనభర్జన పడుతోంది. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో పడిపోయింది. ఇప్పుడు సర్కారును సవ్యంగా నడపాలంటే మాటలు కాదు. చాలా కష్టంతో కూడుకున్న పని.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై మేధావులు ఏనాడో హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటి పోతోందని సూచించారు. అయినా జగన్ సర్కారు పెడచెవిన పెట్టింది. ప్రజా సంక్షేమమే పరమావధి అంటూ ప్రగల్బాలు పలికింది. చివరికి ఆకులు కాలా చేతులు పట్టుకున్న చందంగా మారింది. అయినా ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే ప్రధాన వనరు పైసలే. కానీ అవి దగ్గర లేకుండా పోవడంతో ఎలా అనే ప్రశ్న అందరిలోనూ ఎదురవుతోంది మొత్తానికి జగన్ ఏ మేరకు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి పరిపాలన చేస్తారో వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.