
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ఎంతో స్టడీ చేసి.. మరెంతో కసరత్తు చేసి వాటిని రూపొందించామని ప్రధాని మోడీ కూడా చెప్పారు. కానీ.. ఈ చట్టాలపై రైతుల నుంచి పెద్ద స్థాయిలో వ్యతిరేక వచ్చింది. చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ నెలకు పైగా రోజులుగా హస్తిన కేంద్రంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలు విరమించాలంటూ ప్రభుత్వ పెద్దలందరూ ఇప్పటికే పలుసార్లు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ అయితే దండం పెట్టి మరీ వేడుకున్నారు. కానీ.. రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పలు దఫాలా చర్చలు సైతం జరిపారు. అయినా అవి ఫలించలేదు.
Also Read: బాబోయ్.. చలి‘పులి’ చంపేస్తోంది..!
ఈ రోజు కేంద్రం మరోసారి చర్చలు నిర్వహిస్తోంది. అయితే.. ఈ చర్చల్లో కేంద్రం వెనక్కి తగ్గుతుందా..? రైతు సంఘాల ఒత్తిడికి తలొగ్గుతుందా..? లేక రైతు సంఘాలను ఎలా కూల్ చేయగలరు..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 35 రోజుల రైతుల ఆందోళన నేపథ్యంలో ఇవాళ ఏం తేలనుందన్నది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 2 గంటలకు రైతు సంఘాలతో మంత్రుల బృందంసమావేశం కానుంది. కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శికి సంయుక్తంగా లేఖ రాసిన లేఖ కిసాన్ మోర్చా.. కొత్త సాగు చట్టాల రద్దుపై చర్చించాలని కోరింది.
Also Read: జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు.. మారే 10 అంశాలు మీకు తెలుసా..?
కొత్త అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేలా ఎజెండాలో చేర్చాలని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇవాళ్టి చర్చల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. కేంద్రం ప్రతిపాదనలు, రైతుల డిమాండ్లపై చర్చించారు. ఇవాళ ఢిల్లీ విజ్ఞాన్ భవన్ వేదికగా ఆరో దఫా చర్చలు జరగబోతున్నాయి. మరోవైపు కేంద్రంతో చర్చల నేపథ్యంలో ఇవాళ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని రేపటికి వాయిదా వేశాయి రైతు సంఘాలు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
ఏదిఏమైనా ఇన్నాళ్లు ఎన్ని చట్టాలు చేసినా పెద్దగా విమర్శలు ఎదుర్కోని మోడీ సర్కార్‌కు.. ఈ వ్యవసాయ చట్టాలు మాత్రం విమర్శలు తెస్తోంది. రైతులు ఆందోళనలు విరమించుకోవాలంటూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినిపించుకోకపోవడంతో ఇప్పుడు మరోసారి చర్చలకు పిలిచారు. అయితే.. ఈ చర్చలపై కూడా రైతు సంఘాలు అంతే చాలెంజ్‌గా ఉన్నాయి. రైతు చట్టాలను రద్దు చేసే వరకూ తమ ఆందోళనలను విరమించేది లేదంటూ భీష్మించాయి. నేటి చర్చలైనా ఫలిస్తాయో.. లేవో చూడాలి మరి.