గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఉన్న సీట్లు కోల్పోయినా పార్టమెంట్ ఎన్నికల్లో మాత్రం పుంజుకుని నాలుగు సీట్లు సాధించింది. అందులో నిజామాబాద్ సీటు నుంచి టీఆర్ఎస్ అధినేత కూతురు కవితను ఓడించిన ధర్మపురి అర్వింద్ పై అందరిలో మంచి అభిప్రాయమే ఏర్పడింది. తరువాత దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం బీజేపీని సరైన మార్గంలో నడిపించి టీఆర్ఎస్ ను దెబ్బతీయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఇంత కాలం బీజేపీని విజయ తీరాలకు చేర్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇన్నాళ్లు ఏ కార్యక్రమం చేపట్టినా ఇద్దరు కలిసి ఉండే నేతలు ప్రస్తుతం ఎడమొహం పెడమొహంలా కనిపిస్తున్నాయి. బండి సంజయ్ చేపట్టే ప్రెస్ మీట్లలో కనీసం అర్వింద్ కనిపించడం లేదు. దీంతో వారి మధ్య సయోధ్య కరువైందని తెలుస్తోంది. వారిలో అభిప్రాయ భేదాలు పొడచూపి చివరికి వారిలో లేనిపోని ఆరోపణలు వచ్చేందుకు మార్గాలు చూపిస్తున్నట్లు సమాచారం. బీజేపీ రాబోయే ఎన్నికల్లో తన ప్రభావం చూపెట్టి అధికార పార్టీని దెబ్బతీయాలంటే విభేదాలు పక్కన పెట్టి కలిసి నడిచేందుకు ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఓ పక్క దూసుకుపోతుండగా బీజేపీ మాత్రం వెనుకబడిపోయిందనే అపవాదు మూటగట్టుకుంటోంది. నాయకుల్లో మనస్పర్దలు పక్కనపెట్టి అధికారమే ఎజెంగా ముందుకు నడవాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి అధిష్టానం సైతం చొరవ చూపి నేతల్లో ఉన్న విభేదాలు పక్కన పెట్టి కలిసి నడిచేలా చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని తెలుసుకోవాలి. అధికారమే లక్ష్యంగా బీజేపీ తన పూర్వవైభవం తెచ్చుకునేందుకు పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.