Y S Jagan: ‘ముందస్తుకు నేను రెడీ దమ్ముంటే డేట్ డిక్లెర్ చెయ్.. నేను ప్రభుత్వాన్ని రద్దు చేస్తా’ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన సవాల్ ఇంది. ఈ సవాల్ ద్వారా బీజేపీని డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నంలో కేసీఆర్ కొంతవరకు విజయవంతమయ్యారనే చెప్పవచ్చు. చాలాకాలంగా ముందస్తుకు వెళ్దామని ఆలోచన చేస్తున్న కేసీఆర్ దానిని కూడా తన తప్పుగా, ప్రభుత్వ భయంగా చూపకుండా ఒక సవాల్‌గా కేంద్రాన్ని చాలెంజ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా అన్న విషయంలో క్లారిటీ లేదు. నిజానికి కేంద్రానికి ఆ అవసరం కూడా అంతగా లేదు. బీజేపీ రాజకీయ వ్యూహ కర్తలు ఏం ఆలోచిస్తారో అన్నది ఎవరికీ అంతుచిక్కదు. ఒకవేళ కేంద్రం ముందస్తుసై అంటే.. ఆంధ్రలో వైఎస్సార్‌సీపీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వెళ్లే ఆలోచనలో జగన్ సర్కారు లేదు. ప్రభుత్వానికి ఇంకా రెండేళ్ల సమయం వుంది. మరోవైపు ఆంధ్రాలో ప్రతిపక్షాలు ఎన్నికల యుద్ధానికి కాలు దువ్వుతూ సన్నద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇంత సమయాన్ని వదలుకోవడం.. ముందస్తుకు రెడీ అని ప్రకటించడం మంచి నిర్ణయం అని కూడా అనిపించుకోదు.

రెండేళ్లలో ఏదైనా చేయవచ్చు..
ఆంధ్రప్రదేశ్‌లని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ గ్యాప్‌లో జగన్ ఏదైనా చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ మీద వ్యతిరేకత ఉంటే దానిని మార్చుకోవడానికి రెండేళ్ల సదవకాశం. ఇలాంటి సమయాన్ని జగన్ వదులుకుంటే అంతకన్నా తెలివితక్కువ నిర్ణయం వేరే ఉండదు. కేంద్రానికి ఎలాగైతే ముందస్తుకు వెళ్లే ఆలోచన, అవసరం లేదో.. జగన్ సర్కార్‌కు కూడా ముందస్తు ఆలోచన చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేంద్రంతో మైత్రి జగన్‌కు మేలే..

కేంద్ర ప్రభుత్వంతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నెరుపుతున్న మైత్రి కొంతవరకు ఆ రాష్ట్రానికి, చాలా వరకు జగన్‌కు చాలా వరకు మేలే చేస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌లా జగన్ సవాల్ చేసే పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలో జగన్ పరిస్థితి, లిమిటేషన్లు తెలుసుకున్న కేంద్రం కూడా ముందస్తుకు వెళ్లదు. జగన్ పరిస్థితి మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో భాజపా, దాని మిత్ర పక్షాల పరిస్థితిని కూడా దృష్టిలో వుంచుకోవాల్సి వుంటుంది. పైగా కేíసీఆర్ ను ఈ వేడిలో ఢీకొనడం అంత సబబుగా కూడా ఉండదు. మరో ఏడాది ఆగితే తెలంగాణలో బీజేపీ మరింత బలం పుంజుకునే అవకాశం వుంది.
తెలంగాణలో తెరవెనుక రాజకీయాలు..
బీజేపీ తెలంగాణలో తెరవెనుక రాజకీయాలు మొదలుపెట్టింది. కేసీఆర్ ముందస్తు ఆలోచన నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని విపక్షాలు భావిస్తున్నాయి. అంటే ఇంకా గట్టిగా ఆరు నెలలు కూడా కాలేదు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో చిత్తు చేయడం కోసం ఒక్కొక్క ఎత్తుగడ వేస్తూ, కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్ కేంద్రంపై, బీజేపీపై భగ్గుమంటున్నారు.
ఆంధ్రాలో జనసేన హడావుడి..

మరోవైపు ఆంధ్రాలో ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే హడావుడి మొదలు పెట్టాయి. జనసేనాని పవన్‌కళ్యాణ్ ఇప్పటికే కౌలు రైతులను, నిరుద్యోగులను యువతను కలుస్తున్నారు. తరచూ సమావేశాలు నిర్వహిస్తూ జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితిని అంచనా వేసిన సీఎం జగన్ ప్లీనరీ ద్వారా బల ప్రదర్శనకు దిగారు. ప్రజల బలం, కార్యకర్తల బలం తమకు ఉందని ప్రతిపక్షాలకు ఒక సందేశం ఇచ్చారు. ఎన్నికలకు రెండేళ్ల గడువు ఉన్నందున లోపాలు సవరించుకునే అవకాశమే కనిపిస్తోంది. ముందస్తుకు అడుగులు వేసే ధైర్యం జగన్‌కు లేదనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Director SS Rajamouli: బాహుబలి ఇంటర్వెల్ పై రాజమౌళి సంచలన కామెంట్స్.. అలా చేసి ఉంటే అద్భుతమే
[…] […]
[…] […]