Vishnu Manchu: ప్రభుతం ఏర్పాటు చేయడానికి సాధారణ ఎన్నికలు చాలా రసవత్తరంగా జరుగుతాయి. ఎందుకంటే.. ఒక రాష్ట్రానికి జరిగే ఎన్నికల్లో గెలిస్తే.. అధికారం చేతికి వస్తోంది. కాబట్టి.. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ ఉంటారు రాజకీయ నాయకులు. కానీ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికల్లో గెలిస్తే.. వచ్చేది ఏమి లేదు. పైగా సొంత డబ్బు ఖర్చు పెట్టి.. సేవ చేయాలి.

అసలు సేవ చేయడానికి ఎన్నికల్లో నిలబడటం అవసరమా ? అవసరం అయినా వాళ్లకు సేవ చేయడానికి గుర్తింపు కోసం ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారో అంతుబట్టడం లేదు. ఏది ఏమైనా నటీనటుల ఓవర్ యాక్షన్ కారణంగా.. సాధారణ ఎన్నికలు మించి రసవత్తరంగా మారాయి మా ఎన్నికలు. ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా ఒక్కటి మాత్రం నిజం.
ఇప్పటివరకు ‘మా’ కోసం ఎవరు గొప్పగా ఏమి చేయలేదు. చేయడానికి ఇంకా చాలా ఉంది. ఇప్పుడు చేయడానికి వస్తున్నాం అని చెబుతున్న వాళ్ళు కూడా రాజకీయ లబ్ది కోసమే అని ఆరోణలు ఉన్నాయి. అందుకే, జగన్ ఒత్తిడితో మంచు ఫ్యామిలీకి సీనియర్ నటుల దగ్గర నుంచి నిర్మాతలు, అలాగే ఇతర సినీ ప్రముఖులు సపోర్ట్ చేస్తున్నారు.
మరోపక్క ప్రకాష్‌రాజ్‌కు మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉంది. కానీ ఆ మెగా కాంపౌండ్ కి అధినేత చిరంజీవి కూడా జగన్ మెప్పు కోసం పడిగాపులు కాస్తున్నాడు. అందుకే, చిరు డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు. తమ్ముడు నాగబాబు చేత మద్దతు ప్రకటించారు గాని, చిరు ఎక్కడా డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ కి ఓటు వేయండి అని చెప్పలేదు. కారణం.. మంచు ఫ్యామిలీ వెనుక జగన్ ఉన్నాడనే కోణం ఉండటమే.
మొత్తానికి మా ఎన్నికలపై సినీ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి ఏర్పడింది. విష్ణు( Vishnu Manchu) అధికారికంగా వైసీపీలో ఉన్నారు. ఆ మాటకొస్తే జగన్ ఆశీస్సులతోనే విష్ణు ఎన్నికల బరిలో నిలిచాడని అంటున్నారు. మొత్తానికి విష్ణు విజయం పైనే ఇండస్ట్రీ పెద్దలకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వాలా ? వద్దా ? అని నిర్ణయిస్తారట. మరోపక్క బాలయ్య సైతం విష్ణుకే సపోర్ట్ తెలిపాడు. కాబట్టి ఎన్నికల్లో విష్ణు విజయం ఖాయంలా కనిపిస్తోంది.