KCR- Jagan Mohan Reddy: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యోగాల ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ లో కూడా అసంతృప్తి పెరగనుంది. సాధారణంగా రెండు రాష్ట్రాల్లో ఒకరు చేసింది మరొకరు చేసే దాకా ఊరుకోరు. ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల జాతరతో ఏపీలో కూడా నిరుద్యోగుల్లో ఆగ్రహం పెరుగుతోంది. పక్క రాష్ట్రం చూడు అలా చేస్తుంటే నువ్వెందుకు చేయవు అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో జగన్ మెడకు ఉద్యోగాల బరువు పడనుంది. అసలే అప్పుల్లో రాష్ర్టం కుదేలవుతుంటే కొత్తగా ఉద్యోగాలు ఎక్కడ నుంచి ఇచ్చేదని జగన్ తల పట్టుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ గాడితప్పడంతోనే పాలన కొడిగడుతోంది.

ప్రస్తుతం మళ్లీ ఉద్యోగాలు ఇవ్వడమంటే రుణభారం పెంచుకోవడమే. ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు జీతాలివ్వడానికే నరకయాతన పడుతున్న జగన్ కొత్తగా ఉద్యోగాలు కల్పించి వారికి కూడా వేతనాలు ఎక్కడ నుంచి తెచ్చేదనే ఆలోచనలో పడిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న చర్యలకు జగన్ కు సైతం సెగ తగలనుంది. నిరుద్యోగ సమస్యపై రెండు రాష్ట్రాల్లో నిరసన సెగలు తగలడంతో కేసీఆర్ వాటిని చల్లార్చారు. కానీ జగన్ మాత్రం అందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
Also Read: జనసేన సభా ప్రాంగణానికి ‘దామోదరం సంజీవయ్య’ చైతన్య వేదికగా నామకరణం
ఇప్పటికే ఏపీలో వాలంటీర్ వ్యవస్థతో చాలా మందిని నియమించుకున్నా శాశ్వత స్థాయి ఉద్యోగాల కల్పనకు మాత్రం పెద్దపీట వేయలేదు. అందుకే రాష్ర్టంలో నిరుద్యోగులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ నిరుద్యోగుల సమస్య ఏ మేరకు పరిష్కరిస్తారో తెలియడం లేదు. దీంతో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయకపోతే రాబోయే ఎన్నికల్లో జగన్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో జగన్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది పరిస్థితి. ఉద్యోగాల భర్తీ చేయకపోతే నిరుద్యోగులు ఊరుకోరు. భర్తీ చేస్తే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. దీంతో ఏం చేయాలి రా దేవుడా అని జగన్ అంతర్మథనంలో పడిపోయారు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని తర్జనభర్జన పడుతున్నారు. నిరుద్యోగుల సమస్యను ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తున్నారు. ఏదిఏమైనా జగన్ మాత్రం నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం జగన్ మెడకు చుట్టుకున్నట్లు అయింది.
Also Read: ఈ సారి కూడా కేసీఆర్ పాచిక పారనుందా?
[…] Amaravati Issue: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదు. వైసీపీ తీరుతో పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి తేవడంతో అక్కడ జరిగే పనులన్ని నిలిచిపోయాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల కట్టడాలు సైతం ఆగిపోయాయి. జగన్ తీసుకున్న నిర్ణయంతో అందరు పనులు చేయడానికి వెనుకాడటం జరిగింది. దీంతో అమరావతిలో కేంద్ర విభాగాలు, సంస్థల కోసం స్థలాలు తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని భావించింది. కానీ జగన్ మధ్యలో రాజధానిపై దృష్టి పెట్టకుండా మూడు రాజధానుల అంశం తీసుకురావడంతో పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. […]