KTR: కేటీఆర్‌ ఓటమిని బీఆర్‌ఎస్‌ కోరుకుంటోందా.. సిరిసిల్లలో గుసగుసలు!

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్‌ గెలుస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని సర్వేలు కూడా ఇదే విషయం చెప్పారు. అయితే షాకింగ్‌ విషయం ఏమిటంటే.. ప్రభుత్వ ఇంటలిజెన్స్‌ అధికార బీఆర్‌ఎస్‌కు రెండు రోజుల క్రితం సర్వే రిపోటర్లు ఇచ్చింది.

Written By: Raj Shekar, Updated On : November 23, 2023 8:13 am

KTR

Follow us on

KTR: తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్‌). సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఐదోసారి సిరిసిల్ల నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దిగారు. తెలంగాణలో అభివృద్ధి చెందిన మూడు నియోజకవర్గాల్లో గజ్వేల్, సిద్దిపేటతోపాటు సిరిసిల్ల ఒకటి. ఏ నియోజకవర్గానికి కేటాయించని నిధులను ఈ మూడు నియోజకవర్గాలకే కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌ మంజూరు చేయించుకున్నారు. దీంతో ప్రతీ ఎన్నికల్లో వారు తిరుగులేని మెజారిటీతో గెలుస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లు రాజకీయ సమీకరణలు సిరిసిల్లలో మారుతున్నాయంటున్నారు బీఆర్‌ఎస్‌ శ్రేణులు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక.. ఈసారి సిద్దిపేటలో హరీశ్‌రావు, సిరిసిల్లలో కేటీఆర్‌ ఎవరు ఎక్కువ మెజారిటీ సాధిస్తారన్న చర్చ మొదలైంది. ఎన్నికల నాటికి దీనిపై బెట్టింగులు కొనసాగుతాయని ఊహించారు. కానీ అనూహ్యంగా ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది. ఈ విషయాన్ని ఆయనే అంగీకరించినట్లు కనిపిస్తోంది. అధికారం ఉందని ఇన్నాళ్లూ విర్రవీగిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల్లో ప్రస్తుతం కేటీఆర్‌ ప్రాధేయానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అహంకారం, అహంభావం నుంచి నాలుగు మెట్లు దిగి మాట్లాడుతున్నారు. ఓటర్లను దేవుడు అంటున్నారు. గెలిపించాలని ప్రాధేయపడుతున్నారు.

ఓటమి ప్రచారం ఎందుకు?
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్‌ గెలుస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని సర్వేలు కూడా ఇదే విషయం చెప్పారు. అయితే షాకింగ్‌ విషయం ఏమిటంటే.. ప్రభుత్వ ఇంటలిజెన్స్‌ అధికార బీఆర్‌ఎస్‌కు రెండు రోజుల క్రితం సర్వే రిపోటర్లు ఇచ్చింది. ఇందులో బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని స్పష్టంగా వెల్లడించిందని ప్రచారం జరుగుతోంది. ఇందులో సిరిసిల్లలో కేటీఆర్‌ గెలుపు కూడా అంత ఈజీ కాదని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో గులాబీ ముఖ్యమైన మంత్రిలో టెన్షన్‌ మొదలైంది. ఇన్నాళ్లూ తన గెలుపు నల్లేరు మీద నడకే అని భావిస్తున్న కేటీఆర్‌.. అదే ధీమాతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. కానీ, ఇంటలిజెన్స్‌ రిపోర్టుతో కేటీఆర్‌లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది అప్రమత్తమైన ముఖ్యమైన మంత్రి సిరిసిల్ల నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పుడు ఆ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కేటీఆర్‌ మాట్లాడిన ఆడియో సోషల్‌ మీడియాలోకి రావడమే కేటీఆర్‌ సిరిసిల్లలో బలహీన పడ్డారనడానికి నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు.

ఏం మాట్లాడారంటే..
సిరిసిల్ల సిగ్మెంట్లో ఈసారి కేటీఆర్‌ గెలవడం కష్టమేనని కొంతమంది రాతలు రాస్తున్నారని, దీన్ని నిజమని సొంత పార్టీ లోకల్‌ కార్యకర్తలే కన్ఫ్యూజ్‌ అవుతున్నారని మనలో మనమే చెవులు కొరుక్కుని ప్రమోట్‌ చేస్తూ డ్యామేజ్‌ చేసుకుంటున్నామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కార్యకర్తలతో అన్నారు. మనం కన్ఫ్యూజ్‌ అయ్యి తోటి కార్యకర్తలను, జనాన్ని కన్ఫ్యూజ్‌ చేయవద్దన్నారు. కాంగ్రెస్‌ మౌత్‌ టాక్‌ హైరానా పడొద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మనలో మనం మాట్లాడుకుంటున్నందునే ఓడిపోతున్నామనే వార్తలు వస్తున్నాయని హెచ్చరించారు. ప్రజలను కన్విన్స్‌ చేసి అనుకూలంగా మల్చుకోకపోతే నష్టపోయేది మనమేనని అని హెచ్చరించారు.

ఇక అందుబాటులో ఉంటా..
ప్రజలకు ఎన్నిపనులు చేసినా, ఎంత మంచి చేసినా ఎక్కడో కొంత అసంతృప్తి ఉంటుందని, ప్రజలకు తనకు మధ్య డైరెక్షన్‌ నెక్షన్‌ పోయిందనే అభిప్రాయాలు కూడా జనం నుంచి నియోజకవర్గంలో వినీ సొంత పార్టీ కేడర్లోనే చాలా మందికి తనతో యాక్సెస్‌ లేదనే అసంతృప్తి ఉన్నదని, ఏమున్నా ఉన్నా తనతో చెప్పుకోవాలని కోరు కుంటున్నారని, కానీ ఇంతకాలం ఎమ్మెల్యేగా అందుబాటులో లేకపోయిన మాట నిజమేనని శ్రేణులకు వివరించారు. ఈసారి గెలిస్తే మాత్రం తప్పకుండా రెండురోజులపాటు సిరిసిల్లలోనే ఉంటానని, ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా అందరినీ కలుస్తానని శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు.

ఆ ప్రచారం నమ్మొద్దు..
కేటీఆర్‌కు ఫలానా కులం నుంచి మద్దతు లేదంటూ కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి వార్తల్ని ప్రచారం చేస్తూ ఉన్నదని, దాన్ని మీరు(శ్రేణుల్ని ఉద్దేశించి) కూడా నిజమేనని నమ్మి ఒకరితో మరొకరు మాట్లాడుకుంటూ ఉన్నారని మంత్రి గుర్తుచేశారు. ఈ వారం రోజుల ప్రచారం చాలా కీలకమని, ప్రతీ ఇంటిని టచ్‌చేసి వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి వారికి భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు. కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు.. ఇలాంటి అసంతృప్తులన్నీ ప్రజలు చెప్పుకుంటారని, చిరునవ్వుతో సమాధానం చెప్పి వారికి హామీ ఇవ్వాలని సూచించారు. అన్ని కులాల సంఘాల లీడర్లతో, మాజీ ప్రజా ప్రతినిధులను కలుపుకుపోవాలని, వారి చిన్నచిన్న కోరికలను తీర్చడం పెద్ద కష్టమేమీ కాదని, వారికి హామీ ఇచ్చి మనవైపునకు తిప్పుకోవాలని సూచించారు.

మొత్తంగా మొన్న నిరుద్యోగుల విషయంలో తగ్గిన కేటీఆర్, తాజాగా సొంత నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను త్వరలోనే గుర్తించి కన్వెన్స్‌ చేసేలా మాట్లాడడం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.