https://oktelugu.com/

ఆ పని చేయకపోతే ఇక ‘బండి’ని నమ్మరు..

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా అక్కడక్కడా మాత్రమే కనిపించేంది.. ఈ ఎన్నికల్లో మాత్రం ఎక్కడ చూసినా కాషాయ జెండాలే కనిపిస్తున్నాయి. కమలం పార్టీ నాయకత్వ మార్పుతో యూత్ లో క్రేజ్ సంపాదించింది. ఆ తరువాత అన్ని వర్గాల ప్రజల్లోనూ బీజేపీ గురించి చర్చించుకునే రోజులొచ్చాయి. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా పార్టీ దూకుడు స్వభావం ఎన్నికల్లో గెలుపునకు ఉపయోగపడుతుందా..? లేదా..? అనే అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. Also Read: ఎక్కడా దొరక్కుండా మాట్లాడిన కేసీఆర్! […]

Written By: , Updated On : November 29, 2020 / 11:23 AM IST
Follow us on

bandi sanjay

bandi sanjay

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా అక్కడక్కడా మాత్రమే కనిపించేంది.. ఈ ఎన్నికల్లో మాత్రం ఎక్కడ చూసినా కాషాయ జెండాలే కనిపిస్తున్నాయి. కమలం పార్టీ నాయకత్వ మార్పుతో యూత్ లో క్రేజ్ సంపాదించింది. ఆ తరువాత అన్ని వర్గాల ప్రజల్లోనూ బీజేపీ గురించి చర్చించుకునే రోజులొచ్చాయి. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా పార్టీ దూకుడు స్వభావం ఎన్నికల్లో గెలుపునకు ఉపయోగపడుతుందా..? లేదా..? అనే అంశంపై చర్చ జోరుగా సాగుతోంది.

Also Read: ఎక్కడా దొరక్కుండా మాట్లాడిన కేసీఆర్!

దుబ్బాక ఉప ఎన్నికలో విజయం తరువాత బీజేపీ తెలంగాణలో పట్టు సాధిస్తోంది.  ఆ తరువాత గ్యాప్ లేకుండా వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పట్టు నిలుపుకోవాలని  ఉద్రుతంగా ప్రచాం చేస్తోంది.  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రోజుకో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీకి పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతోంది. ఒకవైపు కేంద్రమంత్రుల, మరోవైపు రాష్ర్టంలోని ఎంపీలు హైదరాబాద్ నలుమూలల ప్రచారం చేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు, హామీలపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

మొన్న జరిగిన ప్రచారంలో బండి సంజయ్ పాతబస్తీలో పాకిస్థానీయులు, రోహింగ్యాలు ఉన్నారని, తాము గెలచిన తరువాత వారిని తరిమికొడతామని వ్యాఖ్యానించారు. దీనికి అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ రోహింగ్యాలుంటే కేంద్ర మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నాడన్నారు.  ఈ వ్యాఖ్యలకు వెంటనే స్పందించిన సంజయ్  బీజేపీ గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వాఖ్యల వేడి చల్లారకముందే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ నెక్లెస్ రోడ్డులోని పీవీ, ఎన్టీఆర్ సమాధులు కూల్చేస్తామన్నారు. దీనికి బండి బదులిస్తూ అ పని చేస్తే 24 గంటల్లో దారుస్సాలం కూల్చేస్తామని హెచ్చరించారు.

Also Read: ఎంఐఎం అతిపెద్ద పార్టీగా మారుతుందా..?

ఇప్పటి వరకు తమ వ్యాఖ్యలతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్న బండి సంజయ్ ఒక వేళ గెలిస్తే ఇవన్నీ చేస్తాడా..? అనే చర్చ సాగుతోంది. కరీంనగర్ లో గత ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుకు క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్రం ప్రవేశపెడుతున్న కొన్ని పథకాలను రాష్ట్రప్రభుత్వం అడ్డుకుంటుందని, అయితే తాను ఎంపీగా గెలిస్తే నేరుగా ప్రజల్లోకి తీసుకొస్తానన్నారు. ఆ తరువాత ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కి అనుకోకుండా  రాష్ట్ర అధ్యక్షుడి పదవి వచ్చంది. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాల్లో  బిజీ అయిపోయారు. కొన్ని రోజుల తరువాత దుబ్బాక ఉప ఎన్నిక, అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడంతో వాటిపైనే ద్రుష్టి పెట్టారు.

ఇప్పడు కూడా ఎడాపెడా హామీలు, ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ ఒక వేళ బీజేపీకి మేయర్ పీఠం దక్కితే గనుక ఈ హామీలన్నీ తీర్చడానికి ఎలాంటి ప్రణాళికలు వేస్తాడోనన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ గెలిచిన తరువాత గనుక బీజేపీ నాయకులు ప్రజలను మరిచిపోతే ఇక వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ కి విలువ ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే తీర్చే హామీలను ఇచ్చి ప్రజల మనసును గెలవాలని కొందరు సూచిస్తున్నారు. దూకుడు స్వభావం యూత్ ను ఆకట్టుకోవచ్చు గానీ మిగతా ప్రజలు మాత్రం వీటిని పట్టించుకోరనే తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్