Homeజాతీయ వార్తలుKCR- New Secretariat: ఇప్పటికైనా కేసీఆర్ సెక్రేటేరియట్ కు రెగ్యులర్ గా వస్తారా?

KCR- New Secretariat: ఇప్పటికైనా కేసీఆర్ సెక్రేటేరియట్ కు రెగ్యులర్ గా వస్తారా?

KCR- New Secretariat: వాస్తు దోషమా.. లేక.. పాత భవనంలోకి వెళ్తే ప్రాణ గండం ఉందని ఎవరైనా చెప్పారో తెలియదు కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్లుగా ప్రగతి భవన్, ఫామ్ హౌస్ నుంచే పాలన సాగిస్తున్నారు. ఎట్టకేలకు పాస భవనం స్థానంలో తాను కోరుకున్న విధంగా కొత్త సచివాలయం నిర్మించి ప్రారంభిత్సవం చేశారు. మరి సీఎం ఇకపైన పాలన మొత్తం ఈ భవనం నుంచి అందిస్తారా? లేక మూణ్ణాళ్ళ ముచ్చటకే పరిమితం చేస్తారా? అనే చర్చ మొదలైంది. ఈ విషయంలో.. అధికారులు, సిబ్బంది మధ్య భిన్నమైన రీతిలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం సచివాలయానికి తరలిరావడంతో సీఎం కూడా కచ్చితంగా వస్తారని అధికారులు బలంగా నమ్ముతున్నారు.

ప్రగతి భవన్ నుంచి.. సెక్రటేరియట్ కు..
సీఎం వెంట నిత్యం పడుల సంఖ్యలో సెక్రెటరీలు ఉంటారు వీరంతా ఇక కొత్త సచివాలయానికి రావాల్సిందే. ఈమేరకు స్క్రేటరీలకు చాంబర్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో సెక్రటరీలంతా సెక్రటేరియట్ కు వస్తే ముఖ్యమంత్రి ఒక్కరూ మాత్రమే ప్రగతి భవన్ నుంచి వ్యవహారాన్ని నడిపించడం ఆచరణ సాధ్యం కాదు. కేసీఆర్ కూడా తాను కోరుకున్న రీతిలో సచివాలయ భవనం నిర్మాణమైనందున పూర్తి సంతృప్తితో ఉన్నారని, రెగ్యులర్ గా రావడానికే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

పాలమూరు ప్రాజెక్టు.. సంక్షేమ పథకాలపై..

తెలంగాణలో బీఆర్ఎస్ ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చింది కేసీఆర్ సంక్షేమ పథకాలే. ఎన్నికల గట్టిగా ఆరు నెలల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంక్షేమ పథకాలు.., సీఎం కోరుకున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై కొత్త సచివాలయంలో రివ్యూ నిర్వహించాలని కేసీఅర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీఎం ఇకపై రోజూ సచివాలయానికి వస్తారని సచివాలయ సిబ్బంది అంటున్నారు.

ఇక రావడంపనే దృష్టి..
జిల్లా స్థాయిలో పథకాలు అమలవుతున్నాయో లేదో తరచూ కలెక్టర్లతోనే డైరెక్టుగా మాట్లాడి రిపోర్టులు తెప్పించుకుంటారని, సచివాలయానికి వచ్చిన తర్వాత పాలనలో ప్రత్యేక తేడా కనిపిస్తుందనే అభిప్రాయాన్ని ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో కలిగించేందుకు సీఎం తరచూ సెక్రటేరియట్ కు రావడానికే మొగ్గు చూపుతున్నారని మరో అధికారి వ్యాఖ్యానించారు.

మూన్నాళ్ల మురిపమే..
ఐ ఏ ఎస్ అధికారులు సీఎం వస్తారని చెబుతుంటే.. ఎన్జీవో ర్యాంక్ సిబ్బందిల మాత్రం మరో రకమైన అభిప్రాయాలు వ్యక్తg చెస్తున్నారు.. కేసీఆర్ కొత్త సచివాలయం మోజు మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుందని, వారానికి రెండు మూడు రోజులకు పరిమితం చేసి ఎన్నికల వేడి మొదలుకాగానే ప్రగతి భవన్ కే పరిమితమవుతారని అంటున్నారు. సచివాలయానికి వచ్చే అలవాటే లేని కేసీఆర్ కొత్త సచివాలయానికి వచ్చే అవకాశాలు తక్కువేనని విపక్షాలు అంటున్నాయి.

సీఎం ఉన చోటే సచివాలయం .
ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే సచివాలయం అని గతంలో అధికార పార్టీ నేతలు చెప్పిన అంశాన్ని పలువురు గుర్తుచేశారు. రెగ్యులర్ గా సెక్రటేరియట్ కు సీఎం వస్తే సిబ్బందిలో స్పష్టమైన తేడా కనిపిస్తుందని, ఆఫీసర్ల స్థాయిలో తీసుకునే నిర్ణయాల్లో వేగం పెరుగుతుందనీ, పెండింగ్ ఫైళ్ళను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం, అన్ని వివరాలను సమగ్రంగా రూపొందించడంలో.. అన్ని దశల్లోనూ ఒక భయం, క్రమశిక్షణ అలవడుతుందంటున్నారు.

యథా సీఎం.. తథా అధికారులు..
ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సెక్రతేరియేట్ కు నిత్యం హాజరుకాకపోతే అధికారుల్లోనూ అలసత్వం, నిర్లక్ష్యం ఉంటుందని, ఆ ప్రభావం రొటీన్ కార్యకలాపాలపై కనిపిస్తుందని గుర్తుచేశారు. ఎవరికెన్ని సందేహాలున్నా సీఎం ఇకపైన రెగ్యులర్ గా సచివాలయానికి హాజరౌతారా లేదా అన్న విషయంపై రానున్న రోజులలో క్లారిటీ వస్తుందన్నారు

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version