https://oktelugu.com/

National Daughters Day : జాతీయ కుమార్తెల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?

కుమార్తెలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతీ ఏడాది జాతీయ కుమార్తెల దినోత్సవాన్ని జరుపుకుంటారు. సెప్టెంబర్ నాలుగో ఆదివారం రోజున ప్రతీ ఏడాద జాతీయ కుమార్తెల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 22 ఈరోజు ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 22, 2024 / 04:41 PM IST

    National Daughters Day

    Follow us on

    National Daughters Day : ప్రతీ ఇంట్లో ఆడపిల్ల ఉండాలని మన పెద్దలు అంటుంటారు. ఆడపిల్ల పుడితే ఇంటికి లక్ష్మీ దేవి వచ్చిందని అభిప్రాయ పడుతుంటారు. ప్రతి తల్లిదండ్రులు వాళ్ల కుమార్తెలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే వాళ్లకు అన్ని అవసరాలు సమకూర్చేలా చేస్తారు. ఎంతో గారాబంతో వాళ్లను పెంచుతారు. ముఖ్యంగా కూతుర్లకు తండ్రితో మంచి అనుబంధం ఉంటుంది. ఏ విషయాన్ని అయిన షేర్ చేసుకుంటారు. కానీ ఈరోజుల్లో ఆడపిల్ల పుడుతుందని తెలియగానే కడుపులోనే హతమారుస్తున్నారు. పుట్టిన తర్వాత కూడా వాళ్లను వదిలేస్తున్నారు. అయితే కుమార్తెల విలువ పెంచుతూ.. వాళ్లను గౌరవించి, కుమార్తెలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతీ ఏడాది జాతీయ కుమార్తెల దినోత్సవాన్ని జరుపుకుంటారు. సెప్టెంబర్ నాలుగో ఆదివారం రోజున ప్రతీ ఏడాది జాతీయ కుమార్తెల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 22 ఈరోజు ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.

    తల్లిదండ్రులకు కూతురు పుడితే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. తమ జీవితాల్లో ఆశలు, కలలు చిగురించాయని, ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని భావిస్తారు. కానీ అప్పటికీ, ఇప్పటికీ లింగ బేధం మాత్రం పోలేదు. కూమారుడిని, కుమార్తెను ఎలాంటి బేధం లేకుండా ఒకేలా చూడాలని, వాళ్లను గౌరవించాలని జాతీయ కుమార్తెల దినోత్సవాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ వాళ్ల కుమార్తెను గౌరవించాలని 2007లో సామాజిక కార్యకర్త అయిన రామచంద్ర సిరాస్ కుమార్తెల దీనోత్సవాన్ని తీసుకొచ్చారు. కూతురు విలువను అందరికీ తెలిసేలా చేయడంతో పాటు, ఈరోజు అవగాహన కల్పించాలని ఈ దినోత్సవాన్ని తీసుకొచ్చారు. కొన్నేళ్ల తర్వాత 2015లో ఐక్యరాజ్య సమితి దీనిని అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తించింది. సమాజంలో అమ్మాయిలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల్లో వీళ్ల గురించి అవగాహన కల్పించడంతో పాటు వీరికి అన్ని రంగాల్లో మంచి అవకాశాలు రావడంతో పాటు ముందు ఉండేలా చేయాలని ఈరోజు ఘనంగా జరుపుకుంటారు.

    జాతీయ కుమార్తెల దినోత్సవం రోజు ఎంత బిజీగా ఉన్న కాస్త సమయం అయిన కూతుళ్లతో గడపాలి. ఇంట్లో లేదా బయట ఏవైనా ఇబ్బందులు పడుతుందటే.. అడిగి తెలుసుకోవాలి. ఎలాంటి లింగ బేధం లేకుండా పెంచాలి. అన్ని రంగాల్లో కుమార్తెలు ముందు ఉండేలా వాళ్లను చిన్నప్పటి నుంచి ప్రోత్సహించాలి. ఇలా కుమార్తెల విలువను అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రస్తుతం రోజుల్లో చాలామంది ఆడపిల్లవి నీకెందుకు ఉద్యోగం, చదువు అన్ని అంటున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన కూడా చివరికి వంటింటికే వాళ్లను పరిమితం చేస్తున్నారు. ఇప్పటికైనా వాళ్లకు ఉద్యోగం, విద్య అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే ఈ దినోత్సవానికి న్యాయం చేసిన వాళ్లం అవుతాం. వాళ్లకు అన్నింట్లో అవకాశాలు ఇవ్వకపోతే ఇలాంటి ఎన్ని దినోత్సవాలు జరుపుకున్న వ్యర్థమే. చిన్నప్పటి నుంచి మీ పిల్లలను లింగ భేదంతో పెంచవచ్చు. కూతురుని కొడుకుని కూడా సమానంగా చూడాలి. అన్ని రంగాల్లో వాళ్లకు తల్లిదండ్రులు కుమార్తెలను ప్రోత్సహించాలి. అప్పుడే కుమార్తెల దినోత్సవానికి ఒక అర్థం ఉంటుంది.