Kerala : జీవితంలో డబ్బు సంపాదించాలని ఎవరికైనా ఉంటుంది. కానీ కొందరు ఎంతకష్టపడినా అనుకున్నంత ధనం సమకూర్చలేదరు. కానీ డబ్బుపై ఆశ తగ్గదు. అయితే కొందరు ఊరికే పనిచేయకుండా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో తమ అదృష్టం ఎలా ఉంటుందో పరీక్షించుకోవాలని అనుకుంటారు.దీంతో లాటరీలు కొంటూ ఉంటారు. రోజూ పనిచేస్తే గానీ డబ్బు ఉండని కొందరు ఇలాంటి లాటరీలు కొనడం వల్ల కోటీశ్వరుడయ్యారని వింటూ ఉంటాం. దీంతో చాలా మందికి ఆశ పుట్టి లాటరీలు కొంటూ ఉంటున్నారు. భారత్ లో లాటరీల వ్యవస్థను 1967లో నిషేధించబడ్డాయి. కానీ కేరళ ప్రభుత్వం మాత్రం అధికారికంగా లాటరీ పద్ధతిని కొనసాగిస్తోంది. అంతేకాకుండా ఈ లాటరీకి ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే తాజాగా అక్టోబర్ 9న మెగా లాటరీ బంపర్ డ్రా నిర్వహించారు. ఈ లాటరీ విజేత ఎవరంటే?
కేరళలో ఓనం పండుగకు విశిష్టత ఉంది. ఈ పండుగ పేరుమీద ‘తిరువోణం బంపర్ BR99’లాటరీలను విక్రయించారు. ఈ టికెట్లను అక్టోబర్ 7 నుంచి విక్రయించారు. మంగళవారం వరకు ఈThiruvonam bumper draw లాటరీని 71, 35, 939 మంది కొనుగోలు చేరశారు. అత్యధికంగా పాలక్కాడ్ జిల్లా నుంచి 1,302, 680 మంది కొనుగోలు చేశారు. ఆ తరువాత తిరువనంతపురం 9,46,2, 260 మంది కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన బంపర్ డ్రాను అక్టోబర్ 9న మధ్యాహ్నం నిర్వహించారు.
ఈ లాటరీ డ్రాను తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్ వద్ద ఉన్న గోర్కీ భవనంలో నిర్వహించారు. ఈ లాటరీ విజేతను ప్రకటించారు. ఈ లాటరీలో వయనాడ్ కు చెందిన TG 434222 నెంబర్ మొదటి బహుమతి గెలుచుకుంది. దీనిని జినేష్ ఏ ఎం అనే వ్యక్తి విక్రయించాడు. అలాగే రెండో బహుమతిని TD 281025, TJ 123040 తదితర నెంబర్లు ఉన్నాయి. ఇప్పటికే లాటరీని కొనుగోలు చేసిన వారు తమ నెంబర్లను సరిచూసుకుంటున్నారు. విజేతలకు ఇప్పటికే సమాచారం అంది ఉంటుంది.
ఈ లాటరీలో మొదటి బహుమతి విజేతకు రూ. 25 కోట్లు ఇవ్వనున్నారు. రెండోబహుమతి 20 మంది విజేతలకు కోటి రూపాయల చొప్పున సాయం చేయనున్నారు. మూడో బహుమతి కింద 20 మంది విజేతలకు రూ.50 లక్షల చొప్పున అందించనున్నారు. అలాగే కన్సోలేషన్ కింద రూ. 5 లక్షలు ఇవ్వనున్నారు. కేరళ లాటరీ మొత్తం 10 సిరీస్ లో ఉంటుంది. వీటిలో TA, TB, TC, TD, TE, TG, TH, TJ, TK సిరీస్ లో ఉంటుంది. ఈ లాటరీ ఒక్కోటి రూ.500 చొప్పున విక్రయించారు.
లాటరీని విక్రయించే సమయంలో కొన్ని నెంబర్లను కేటాయిస్తారు. ఈనెంబర్లు విజేతల నెంబర్లతో పోల్చగా సరితూగితే అదృష్టం వరించినట్లే. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని లాటరీ కొనుగోలు చేసిన వారు బుధవారం ఉదయం నుంచి ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన తమ నెంబర్లు వచ్చిన వారు సంబరాలు చేసుకుంటున్నారు. నెంబర్ తగలని వారు మరోసారి ప్రయత్నించాలని ఆశపడుతున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Do you know who is the winner of kerala thiruvonam bumper draw
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com