K Vishwanath-Chiranjeevi : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ ఆల్ టైం క్లాసిక్ చిత్రాలకు పుట్టినిల్లు లాంటి మహా దర్శకుడు కె విశ్వనాథ్ నేడు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ స్వర్గస్తులైన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది..ప్రతీ ఒక్కరిని ఎంతో ప్రేమతో పలకరిస్తూ వాత్సల్యం ని చూపించే విశ్వనాథ్ అంటే ప్రతీ ఒక్కరికీ ఎంతో గౌరవం..ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనని తన సొంత తండ్రిలాగా భావిస్తాడు.

ప్రతీ పుట్టినరోజు కి తన సతీమణి సురేఖ తో కలిసి విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్లి కలిసి ఆయనతో కొద్ది సమయం గడిపి ఇంటికి తిరిగి వెళ్లేవారు చిరంజీవి..చిరంజీవి తో విశ్వనాథ్ గారు చేసిన సినిమాలు కేవలం రెండే..ఒకటి శుభలేఖ సినిమా కాగా, మరొకటి స్వయం కృషి..ఈ రెండు సినిమాలు నటుడిగా చిరంజీవి కి , దర్శకుడిగా విశ్వనాథ్ కి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి.
కేవలం రెండు సినిమాలతోనే చిరంజీవి మరియు విశ్వనాథ్ మధ్య అంత సాన్నిహిత్యం ఏర్పడడానికి గల కారణం ని చిరంజీవి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు..ఆయన మాట్లాడుతూ ‘నేను శుభలేఖ సినిమా షూటింగ్ చేస్తున్న సమయం లో మధ్యాహ్నం పూట అన్నం తినే వాడిని కాదు..మూవీ యూనిట్ ఎంత ఒత్తిడి చేసిన నాకు వద్దు అయ్యా..ఒకసారి చెప్పా కదా మీకు అనేవాడిని..ఈ విషయం విశ్వనాథ్ గారికి తెలిసింది..వెంటనే తన చేతితో పులిహోర వడ్డించి ‘ఇది విశ్వనాథ్ ప్రేమతో కలిపి ఇచ్చిన అన్నం’ అని చెప్పు..మాట్లాడకుండా తినేస్తాడు అని చెప్పాడట..అతను తినక పోతే నేను అతని చేత పని ఎలా చేయించుకునేది.. అతను ఆకలితో ఉండకూడదు అని విశ్వనాథ్ చెప్పి పంపాడట..విశ్వనాథ్ గారు కలిపి ఇచ్చిన ఆ పులిహోర అన్నం తీసుకొని ఆ అసిస్టెంట్ వద్దకి వెళ్ళినప్పుడు నేను ‘ఏంటయ్యా..ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు’ అని అరిచాను..అప్పుడు అతడు ఇది విశ్వనాథ్ గారు మీకోసం కలిపి మరీ పంపించాడు అని చెప్పాడు..
అప్పుడు మారు మాట్లాడకుండా తినేసి విశ్వనాథ్ గారిని ప్రేమతో కౌగలించుకున్నాను..అప్పటి నుండి ఆయన అంటే నాకు తండ్రితో సమానంగా మారిపోయాడు’ అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి..అలా అత్యంత సన్నిహితుడైన విశ్వనాథ్ గారికి ఇలా జరగడం తో మెగాస్టార్ చిరంజీవి ఎంత బాధ పడుతూ ఉంది ఉంటాడో ఊహించుకోవచ్చు.