PM Modi America Visit: మోడీ కోసం అమెరికా అధ్యక్షుడు రెడీ చేయించిన వంటకాలు ఏంటో తెలుసా?

నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అమెరికాలోని చెఫ్ జిల్ బైడెన్ స్పందించారు. శ్వేత సౌధంలో ఉండే అధికారిక విందులో చిరుధాన్యాలను చేర్చారు. అయితే భారత ప్రధాని అమెరికా కు వస్తున్న సందర్భంగా ఆ వంటకాలను ప్రదర్శించారు.

Written By: Chai Muchhata, Updated On : June 22, 2023 10:24 am

PM Modi America Visit

Follow us on

PM Modi America Visit: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జోబైడన్ దంపతులతో మోడీ భేటీ అయ్యారు. మోదీ పర్యటనలో భాగంగా గురువారం వైట్ హౌస్ ఇచ్చే విందులో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ కోసం ప్రత్యేకంగా భారతీయ వంటకాలు తయారు చేసే బాధ్యత జిల్ బైడెన్ తీసుకున్నారు. ఆమె గెస్ట్ చెఫ్ నీనా కుర్టిస్ తో కలిసి అరుదైన వంటకాలు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మోదీ గతంలో ఇచ్చిన పిలుపు మేరకు చిరుధాన్యల వంటకాలు కూడా మెనూలో చేర్చారు. అయితే ఇప్పటికే ప్రధానికి ఇచ్చే విందుకు సంబంధించిన వంటకాలను ప్రదర్శించారు.

2023 మార్చిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిరుధాన్యాల సదస్సును ప్రారంభించారు. వ్యవసాయంలో రసాయనాలు ఎక్కువగా వాడడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ అలాంటి నష్టాలు రాకుండా ఈ సదస్సులో విలువైన సూచనలు అందిస్తారని చెప్పారు. ఈ సదస్సులకు ‘శ్రీఅన్న’ అని నామకరణం చేశారు. ఐక్యరాజ్య సమమితి కూడా 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.

నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అమెరికాలోని చెఫ్ జిల్ బైడెన్ స్పందించారు. శ్వేత సౌధంలో ఉండే అధికారిక విందులో చిరుధాన్యాలను చేర్చారు. అయితే భారత ప్రధాని అమెరికా కు వస్తున్న సందర్భంగా ఆ వంటకాలను ప్రదర్శించారు. ఈ చిరుధాన్యాల వంటకాలు తయారు చేయడానికి గెస్ట్ చెఫ్ నీనా కుర్టిన్ సహాయాన్ని తీసుకున్నారు. అమెరికాలోని అధికారిక నివాసంలో భారతీయ వంటకాలు టేస్ట్ చేసే భారత ప్రధాని మోదీనే కానున్నారు.

ఇక ఈ మెనూలో మిల్లెట్, పుచ్చకాయ, అవకాడో సాస్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్, స్టప్డ్ పోర్టబెల్లో మష్రూమ్స్, కుంకుమ పువ్వుతో కూడిన రిసోటో, లెమెన్ దిల్ యోగర్ట్ సాస్, క్రిస్ప్డ్ మిల్లెట్ కేక్స్, వేసవి పానీయాలు తదితర వంటకాలు ఉన్నాయి. వీటికి ఇప్పటికే శ్వేత సౌధంలో ప్రదర్శించిన మీడియాకు చూపించారు. ఇక ఈ విందు తరువాత మోదీ జాషువా బెల్ సెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నిర్వహించే షోలో పాల్గొననున్నారు.

మోదీ డిన్నర్ సందర్భంగా ఆకర్షించే థీమ్ ను ఏర్పాటు చేశారు. భారత జాతీయ పక్షి అయిన నెమలి పురి విప్పినప్పుడు ఉండే క్షణాలు, ఆ సమయంలో పొందే అనుభూతికి మ్యూజిక్ ను చేర్చి ప్లే చేయనున్నట్లు శ్వేత సౌధం సామాజిక కార్యదర్శి కార్లోస్ ఎలిజొండో తెలిపారు. ఇక అధికారిక విందు మెనూకు సంబంధించి పేస్ట్రీ చెఫ్ సుసీ మారిసన్ తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.