G20 Summit 2023 Budget: ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమావేశాలు విజవంతంగా నిర్వహించింది. ఈ సమావేశాలకు 30 మంది దేశాధినేతలతోపాటు 14 మంది అంతర్జాతీయ సంస్థల అధినేతలు హాజరయ్యారు. అయితే ఈ సమ్మిట్ కోసం భారత ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. ఎంత ఖర్చు చేసిందనే వివరాలు తెలుసుకుందాం.
ప్రతిష్టాత్మకంగా నిర్వహణ..
కేంద్రం జీ20 సమావేశాల నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. న భూతో న భవిష్యత్ అనే రీతిలో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాసహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నాయకులు హాజరయ్యారు.
మొత్తం ఖర్చు రూ.4,100 కోట్లు..
ఇంత వైభవంగా నిర్వహించిన ఈ జీ20 సదస్సు నిర్వహణకు భారత ప్రభుత్వం ఖర్చుకూడా భారీగానే చేసింది. కొన్ని నివేదికల ప్రకారం.. జీ20 సమ్మిట్ కోసం కేంద్రం రూ.4,100 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు సమాచారం. రోడ్లు, సెక్యూరిటీ, ఫుట్‌పాత్‌లు, లైటింగ్‌తోపాటు ఇతర పనుల కోసం ఈ డబ్బును ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. మేక్‌ఓవర్ ప్రక్రియలో భాగంగా దేశ రాజధానిలోని వివిధ ప్రదేశాలలో అనేక శిల్పాలు కూడా ఏర్పాటు చేశారు.
దేనికి ఎంత…
కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి తెలిపిన వివరాల ప్రకారం.. రాజధానిలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ – సుందరీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2700 కోట్లు కేటాయించింది. ఈ కేంద్ర నిధులను పీడబ్ల్యూడీ – ఎంసీడీ మేక్‌ఓవర్ కోసం ఉపయోగించింది.
ఎన్‌డీఎంసీ రూ.60 కోట్లు,
డీడీఏ తరఫున రూ.18 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ నుంచి రూ.26 కోట్లు,
పీడబ్ల్యూడీ తర ఫున రూ.45 కోట్లు
ఎంసీడీ నుంచి రూ.5 కోట్లు
ఎంఈఏ నుంచి రూ.0.75 కోట్లు
ఫారెస్ట్ డిపార్ట్ మెంట్‌కు రూ.16 కోట్లు కేటాయించారు.
శాంతిభత్రల పరిరక్షణకు ఢిల్లీ పోలీసులకు రూ.340 కోట్లు ఖర్చు చేశారు.
ఐటీపీవో కోసం రూ.3,600 కోట్లు ఖర్చు చేశారు.
మిగతా నిధులు భారత మండపం నిర్మాణం, డెరకేషన్, లైటింగ్ తదితర పనులకోసం ఖర్చు చేశారు. మొదట కేవలం రూ.927 కోట్లు సరిపోతాయని అంచనా వేశారు. కాని దానికి నాలుగింతలు వెచ్చించారు.
ఇతర దేశాలు..
జీ20 శిఖరాగ్ర సమావేశాల కోసం గతంలో ఇతర దేశాలు కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశాయి. 2018లో బ్యూనస్ ఎయిర్స్ సమ్మిట్‌కు 112 మిలియన్ డార్లు ఖర్చు చేసింది. 2010 టొరంటోలో జరిగిన సమ్మిట్ కోసం కెనడా సీడీఏ 715 మిలియన్స్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 నవంబర్‌లో ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. 2024 జీ20 సమావేశాలు బ్రెజిల్ నగరంలో జరగనుంది.