‘దసరా కిక్కు’: ఎన్ని కోట్ల మద్యం తాగేశారో తెలుసా?

తెలంగాణలో దసరా పండుగ వచ్చిందంటే మద్యంబాబులకు కిక్కు మాములగా ఉండదు. అటు ప్రభుత్వం సైతం దసరా పండుగ వచ్చిందంటే ఖజానా లెక్కలపై పడుతుంది. ప్రతీసారి ఇతర పండుగలకంటే దసరాకు ఫుల్‌ ఇన్‌కం ఉంటుంది. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో కొన్ని రోజులు మద్యం అమ్మకాలను నిలిపివేసింది. ఆన్‌లాక్‌లో భాగంగా మొట్టమొదటిసారిగా మద్యం విక్రయానికే పర్మిషన్‌ ఇచ్చారు. ప్రారంభంలో అమ్మకాలు కాస్త తగ్గినా ఆ తరువాత జోరందుకున్నాయి. దీంతో ఈసారి అమ్మకాలు తగ్గుతాయని భావించిన ప్రభుత్వానికి ఊహించని విక్రయాలతో […]

Written By: NARESH, Updated On : October 27, 2020 1:16 pm

Alchohol transfort

Follow us on

తెలంగాణలో దసరా పండుగ వచ్చిందంటే మద్యంబాబులకు కిక్కు మాములగా ఉండదు. అటు ప్రభుత్వం సైతం దసరా పండుగ వచ్చిందంటే ఖజానా లెక్కలపై పడుతుంది. ప్రతీసారి ఇతర పండుగలకంటే దసరాకు ఫుల్‌ ఇన్‌కం ఉంటుంది. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో కొన్ని రోజులు మద్యం అమ్మకాలను నిలిపివేసింది. ఆన్‌లాక్‌లో భాగంగా మొట్టమొదటిసారిగా మద్యం విక్రయానికే పర్మిషన్‌ ఇచ్చారు. ప్రారంభంలో అమ్మకాలు కాస్త తగ్గినా ఆ తరువాత జోరందుకున్నాయి. దీంతో ఈసారి అమ్మకాలు తగ్గుతాయని భావించిన ప్రభుత్వానికి ఊహించని విక్రయాలతో ఫుల్‌ జోష్‌లో ఉంది. ప్రతీసారి దసరాకు ముందు, ఆ తరువాత దాదాపు మూడు నాలుగు రోజులు మద్యం అమ్మకాలు జోరుగా ఉంటాయి. ఈసారి ఆదివారం దసరా పండుగ సందర్భంగా రెండు రోజుల ముందు నుంచే అమ్మకాల్లో ఊపు పెంచాయి. శుక్రవారం రూ. 131 కోట్ల మద్యం విక్రయించగా, శనివారం రూ. 175 కోట్ల లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి. ఇక దసరా రోజున ఆదివారం రూ. 100 కోట్ల ఆదాయం వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. సోమవారం నాడు ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఆరోజు కూడా మద్యం విక్రయాలు బాగానే సాగాయి. మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో రూ. 406 కోట్ల మద్యం విక్రయం ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది వారం రోజుల్లో రూ. 1374 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి రూ. 1979 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా సమయంలోనూ అమ్మకాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. కష్టకాలంలోనూ మద్యం విక్రయాలు తక్కేవేం కాలేదని, గతేడాది కంటే ఎక్కువగానే సాగాయని వారు పేర్కొంటున్నారు. ఇక ఆన్‌లాక్‌ తరువాత కరోనాను పట్టించుకోకుండా మద్యం బాబులు మందును తెగ తాగేశారు. కరోనా ఆన్‌లాక్‌ నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ. 600 కోట్ల మద్యం విక్రయించినట్లు తెలుస్తోంది. లిక్కర్‌ రేట్లు పెంచినా విక్రయాలపై ఎటువంటి ప్రభావం పడలేదు. అయితే లిక్కర్‌తో పోలిస్తే బీర్లు మాత్రం తక్కువే అమ్ముడుపోయాయి. అయితే బార్లు, రెస్టారెంట్ల కంటే వైన్స్‌షాపుల ద్వారా ఎక్కువగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: బీజేపీ వర్సెస్‌ టీఆర్‌‌ఎస్‌.. సిద్దిపేటలో హైటెన్షన్‌