Homeజాతీయ వార్తలుBJP Donations: అధికారంలో ఉంటే అంతే... బిజెపికి ఎన్ని విరాళాలు వచ్చాయో తెలుసా?

BJP Donations: అధికారంలో ఉంటే అంతే… బిజెపికి ఎన్ని విరాళాలు వచ్చాయో తెలుసా?

BJP Donations
BJP Donations

BJP Donations: భారతీయ జనతా పార్టీకి విరాళాలు వెల్లువలా సాగుతున్నాయి. మిగతా పార్టీలు కనీసం దాని కనుచూపుమేరలో కూడా లేవు. స్థూలంగా చెప్పాలంటే అన్ని పార్టీలు ఒక ఎత్తు. బిజెపి ఒక ఎత్తు.. మొత్తంగా 336.50 కోట్లతో బిజెపి అత్యధికంగా విరాళాలు స్వీకరించిన పార్టీగా ఆవిర్భవించింది.. పైగా ఇవన్నీ ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు నుంచి రావడం గమనార్హం. కాంగ్రెస్ కు 95.4 6 కోట్లు డొనేషన్ల రూపంలో రావడం గమనార్హం.. 2021- 22 కు సంబంధించి ఏడిఆర్ రిపోర్ట్ ఈ వివరాలు వెల్లడించింది.

Also Read: CM KCR Kondagattu: కొండగట్టు భూములపై ‘కల్వకుంట్ల’ కన్ను.. అందుకే అంజన్న గుర్తొచ్చాడా!?

2021_2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బిజెపి మొత్తం 4,957 మంది దాతల ద్వారా 614 కోట్ల విరాళాలు పొందింది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ 1,255 మంది దాతల ద్వారా 95.4 6 కోట్ల విరాళాలు స్వీకరించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలు వెళ్లడయ్యాయి.. కాంగ్రెస్, సీపీఎం,సీపీఐ,ఎన్సీపీ, తృణ ముల్ కాంగ్రెస్ పార్టీలకు కలిపి వచ్చిన దానికంటే మూడు రెట్లు ఎక్కువగా బీజేపీకి విరాళాలు వచ్చాయి..

BJP Donations
BJP Donations

2021_22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని రాజకీయ పార్టీలకు మొత్తం 7,141 మంది దాతల నుంచి 780.77 కోట్ల విరాళాలు సమకూరాయి. దాతల నుంచి 20వేల కు మించిన విరాళాలు స్వీకరించలేమని బహుజన్ సమాజ్వాది పార్టీ స్పష్టం చేసింది. 2020_21 ఆర్థిక సంవత్సరంలో బిజెపికి 477.55 కోట్ల డొనేషన్ రాగా, 2021 _22 లో ఇవి 28.61 శాతం పెరిగి 614 కోట్లకు చేరాయి.. కాంగ్రెస్ డొనేషన్లు కూడా 74.52 కోట్ల నుంచి 95.4 6 కోట్లకు పెరిగాయి. రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో 395.85 కోట్లు ఢిల్లీ నుంచి, 105.35 కోట్లు మహారాష్ట్ర నుంచి, 44.96 కోట్లు గుజరాత్ నుంచి వచ్చాయి. రాష్ట్రం పేరు, పాలిత ప్రాంతం పేరు చెప్పకుండా 12.26 కోట్ల విరాళాలు వచ్చాయి. రాజకీయ పార్టీలకు డొనేషన్లు ఇచ్చిన మొత్తం 7,141 దాతల్లో 4,506 మంది వ్యక్తులు కాగా, మరో, 2,551 మంది కార్పొరేట్, పర రంగాలకు చెందిన వారు ఉన్నారు.. బీజేపీ కి 2,068 కార్పొరేట్, వ్యాపార సంస్థల నుంచి 548.81 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. ఇందులోనూ అత్యధికంగా 336.50 కోట్లు డొనేషన్ ను ప్తుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ఒకటే బిజెపికి ఇవ్వడం విశేషం. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి 16.50 కోట్లు విరాళం ఇచ్చింది. రాజకీయ పార్టీలకు అత్యధికంగా డొనేషన్లు ఇచ్చిన ట్రస్ట్ కూడా ఇదే.

Also Read:Godavari Express Incident: గోదావరి ఎక్స్ప్రెస్ ఘటన: ఇవాళ, రేపు రద్దయిన రైళ్ల వివరాలు ఇవే

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Oktelugu Epaper
Exit mobile version