Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వైసీపీపై పోరుబాట చేపట్టింది. వైసీపీ పాలనను ఎండగట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ర్టంలో అదుపులో లేని నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాలని చూస్తోంది. దీనికి గాను రాష్ర్టవ్యాప్తంగా టీడీపీ రేపటినుంచి నిరసనలు కొనసాగించాలని సూచించింది. జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ అడుగడుగునా విరుచుకుపడేందుకు ప్రణాళికలు రచించింది. ప్రభుత్వ వైఫల్యాలను చూపుతూ ప్రజలను రక్షించాలని ఉద్యమించనుంది. దీంతో రాష్ర్టంలో రెండు పార్టీలు తమ ప్రభావం చూపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు వైసీపీ అటు టీడీపీ ప్రజల్లోకి వెళ్లి నేరుగా తేల్చుకోవాలని చూస్తున్నాయి.

సంక్షేమ పథకాలతో వైసీపీ దూసుకెళ్తుంటే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందంటూ టీడీపీ తమ వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ర్టంలో రాజకీయం మరోమారు రసకందాయంలో పడనుంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఎలాగైనా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలని ఆరాట పడుతున్నాయి. ఇందుకు గాను సమస్యలను సాకుగా చూపుతూ ముందుకు వెళుతున్నాయి.
Also Read: పొత్తుకు జనసేన షరతులు.. చంద్రబాబు ఓకే చెప్పేనా?
ఉద్యోగుల జీవితాలతో వైసీపీ చెలగాటం ఆడుతోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏం ప్రయోజనాలు అందకుండా చేస్తోంది. అటు ఉద్యోగులకు గుర్తించకుండా ఇటు ఏ రకమైన పథకాలు అందకుండా చేస్తోంది. దీంతో వారు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ మాఫియా, ఇసుక అక్రమ రవాణా, మైనింగ్ వ్యాపారాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని ప్రతిపక్షాల ఆరోపణ. దీంతో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని మరో వాదన కూడా వస్తోంది.
దీంతో ఏపీలో వైసీపీ, టీడీపీ తమ బలాలు ప్రదర్శించనున్నాయి. కేడర్ కు ఇప్పటికే పలు విషయాల్లో పోరాడాలని టీడీపీ సూచించినట్లు తెలుస్తోంది. టీడీపీ చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టాలని వైసీపీ భావిస్తోంది. మొత్తానికి రాష్ర్టంలో రెండు పార్టీల మధ్య పోరాటం తారాస్థాయికి చేరనుంది. మరోవైపు జనసేన కూడా ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఏదిఏమైనా రాష్ర్టంలో అధికారం కోసం పార్టీల మధ్య వైరం ఇంకా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
[…] […]