Homeఆంధ్రప్రదేశ్‌RGV vs AP Govt: ఆర్జీవీతో ఏపీ ప్రభుత్వం చేతులు కాలాయా?

RGV vs AP Govt: ఆర్జీవీతో ఏపీ ప్రభుత్వం చేతులు కాలాయా?

RGV vs AP Govt: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారిందట ఏపీ ప్రభుత్వం పరిస్థితి. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత గాయి చేస్తుందో మన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా అంతే.. ఏపీలో ఉన్నాడు కాబట్టి నిన్న కాస్త సాఫ్ట్ గా మాట్లాడాడు. ఇప్పుడు తెలంగాణలోని హైదరాబాద్ కు వచ్చేసరికి రాంగోపాల్ వర్మ మాట మార్చేశాడు.

RGV vs AP Govt
RGV vs AP Govt

తాజాగా ట్వీట్లతో విరుచుకుపడ్డాడు. మహారాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర వాడు కానప్పటికీ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.2200 ధర నిర్ణయించారని.. అదే ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడైనా ఇక్కడి ప్రభుత్వం కేవలం రూ.200 మాత్రమే ధర నిర్ణయించిందని .. ‘కట్టప్పను చంపింది ఎవరు?’ అంటూ ఏపీ ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ మరోసారి విరుచుకుపడ్డాడు.

Also Read:  ‘హీరో’లో కృష్ణ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!

ఉత్తర భారతదేశంలోనూ ఐమాక్స్ లలో టికెట్ రేటును రూ.2200 పెట్టారని.. కానీ ఏపీలో పుట్టిన రాజమౌళికి ఆ ప్రభుత్వం ఏం గౌరవం ఇస్తుందని వర్మ ప్రశ్నించారు.

ఏపీలో ఉండగా రాంగోపాల్ వర్మ చాలా పద్ధతిగానే మాట్లాడారు. జగన్ ను, పేర్నినానిని ఏమీ అనలేదు. వారి ప్రభుత్వ విధానం అని.. నా సలహాలు పాటిస్తారని ఆశిస్తున్నానని వెనకేసుకొచ్చాడు.

కానీ హైదరాబాద్ రాగానే వర్మలోని అసలైన అపరిచితుడు మేల్కొన్నాడు. మీడియా ముందుకొచ్చి ఏపీ ప్రభుత్వం తీరును.. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి టాలీవుడ్ పై తిట్టిన విధానాన్ని.. ఆఖరుకు మంత్రి పేర్నినానిపై కూడా విమర్శలు గుప్పించారు. ‘వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఇడియట్ అని.. ఇలాంటి వారి వల్లే జగన్ పై గౌరవం పోతోందని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మంత్రి పేర్ని నాని సైతం టికెట్ రేట్ల విషయంలో వ్యవహరించే విధానం సరికాదని వర్మ హైదరాబాద్ కొచ్చాక విరుచుకుపడ్డారు.

వర్మ లాంటి వివాదాస్పద దర్శకుడిని అసలు కెలకడమే పెద్ద తప్పు.. కెలికి మరీ వదిలేశారు. ఇప్పుడు వదలుతాడా? ఉదహారణలతో సహా ఏపీ సర్కార్ ను చెడుగుడు ఆడుతున్నారు. ఇలాగే కొనసాగితే ఏపీ ప్రభుత్వాన్ని మరింత డ్యామేజ్ చేస్తాడు. వర్మ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు నిజంగానే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

7 COMMENTS

  1. […] Polavaram:  ఆంధ్రప్రదేశ్ జీవనాడి ‘పోలవరం’ ప్రాజెక్టు నిర్మాణానికి అడగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 23 లక్షల ఎకరాలకు నీరందించాలని పెట్టుకున్న లక్ష్యం నీరుగారిపోతుంది. వందలాది మంది ఇంజనీర్ నిపుణులు, వేలాది మంది శ్రామిక శక్తిని ఉపయోగించి ‘పోలవరం’ పనులు మొదలు పెట్టినా పూర్తికావడానికి ఇంకెంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి. 2004లో పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమై రెండు దశాబ్దాలకు చేరువవుతోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ.. ‘పోలవరం’ మాత్రం పూర్తి కావడం లేదు. అప్పుడు పూర్తిచేస్తాం.. ఇప్పుడు పూర్తి చేస్తాం.. గద్దెనెక్కిన ప్రభుత్వాలు మాటలు నీటిమూటలే అవుతున్నాయి తప్ప ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి మాత్రం ఏ ప్రభుత్వమూ సాహసించడం లేదు. దీంతో వృథాగా పోయే 30 టీఎంసీల నీటికి అడ్డుకట్ట వేయాలన్న ప్రణాళిక ఫెయిల్ అవుతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా పోలవరం గురించి పలు విశేషాలు మీకోసం.. […]

  2. […] 5 Assembly Elections:  కరోనాను కాదని ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల పోలింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వర్చువల్ ప్రచారం చేసుకుంటూ ఎన్నికలను నిర్వహించుకోవాలని చెబుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో కదం తొక్కేందుకు సిద్ధవుతున్నాయి. ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల వరకు ఈ రాష్ట్రాల్లోని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై వీటి ఫలితాల ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ప్రతీ పార్టీకి ఈ ఎన్నికలు సవాల్ గానే నిలవనున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ మరోసారి పాగా వేసేందుకు ప్లాన్ వేస్తోంది. అటు మిగతా మూడింటిని కైవలం చేసుకునేందుకు వ్యూహం పన్నుతోంది. […]

  3. […] Spousal relationship: సంసారం అన్నాక ఈదాల్సిందే.. ఆ సాగరం దాటాలంటే కష్టసుఖాలు పంచుకోవాలి..కానీ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఈ జంటది మున్నాళ్ల ముచ్చటైంది. కారణం ఒక్కటే భర్తకు అనారోగ్యం. ఎవరు సాకాలని భార్య వదిలేసి వెళ్లిపోయింది. తాజాగా భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ అరుదైన కేసు వివరాలు బయటకు పొక్కాయి. […]

  4. […] Hero Krishna fans: సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సపోర్టుతో గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి అందరికీ తెల్సిందే. ‘హీరో’ మూవీతో జనవరి 15న గల్లా అశోక్ తెలుగు ప్రేక్షకులను పలుకరించ బోతున్నాడు. ఈ మూవీలో అశోక్ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular