
కరోనా సెకండ్ వేవ్ భారత్ ను అతలాకుతలం చేస్తోంది. కేసుల పెరుగదలతో పాటు మరణాలు అధికంగా జరుగుతుండడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఇదే అదననుగా కరోనా బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుడా ఆసుపత్రి బిల్లు చెల్లిస్తేనే డెడ్ బాడీని ఇస్తామంటున్న సంఘటనలూ ఉన్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా రోగులకు చికిత్స చేసే మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకునే రోగుల నుంచి వసూలు చేసే ఛార్జీలను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ బెడ్ కు ఒకరోజు రూ.4000, ఆక్సిజన్ ఉంటే రూ.6,500, వెంటిలేటర్ తోపాటు బెడ్ సౌకర్యం కల్పిస్తే రూ. 9000గా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జీవో 248 ను కూడా జారీ చేసింది. కొన్ని నెలల కిందట ఈ జీవో జారి చేసినా కొన్ని ఆసుపత్రులు మాత్రం లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు.
దీంతో పైన సూచించిన రేట్లు కాకుండా అధిక బిల్లులు వసూలు చేస్తే టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని తాజాగా సూచించింది. ఫోన్ చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని విజిలెన్స్ కమిటీ పేర్కొంది. ఫోన్ చేసిన తరువాత ఆయా ఆసుపత్రులు అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు అంటున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లు ఇలా ఉన్నాయి. సీఎం క్యాంపు ఆఫీసు: 04023403999, డీఎంహెచ్ వో సెల్ నెం: 9705462662, ఆర్ డీ ఓ : 7680906650, డీపీవో : 99491865049 నెంబర్లకు చేయాలని అంటున్నారు. ఇక స్కానింగ్ విషయంలో కూడా నిర్ణీత రేటును మాత్రమే తీసుకోవాలని సూచించారు.
డయోగ్నస్టిక్ సెంటర్లలో, ఆసుపత్రిలో ఫిల్మ్ తో పాటు స్కానింగ్ 2,500 , పిల్మ్ లేకుండా రూ.2000 తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు లక్ష రూపాయల అడ్వాన్స్ పెట్టనిదే కొన్ని ఆసుపత్రులు కరోనా రోగులను చేర్చుకోలేని పరిస్థితి ఉంది. దీంతో కొందరు బిల్లులు కట్టలేక లబోదిబోమన్నారు. ఒకవేళ కరోనా పెషెంట్ చనిపోతే పూర్తి బిల్లు చెల్లించనిదే డెడ్ బాడీ ఇవ్వమని కూడా తెలిపింది. దీంతోతాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పటికైనా ఆసుపత్రులు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకే చికిత్స చేస్తారా..? లేదా.? చూడాలి..