Rajya Sabha Seats: వారంతా పార్టీ జెండా మోసిన వారూ కాదు. పార్టీ కార్యక్రమాల్లో కనిపించరు. అసలు పార్టీ వాసనే తెలియదు. కానీ వారికి అత్యున్నత పదవులు కట్టబెడుతున్నారు. వైసీపీ శ్రేణుల్లో అంతర్మథనం ఇది. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడిన చాలామంది నేతలకు అధినేత హ్యాండ్ ఇస్తున్నారు. ముక్కూ ముఖం తెలియని వారికి మంచి పదవులు ఇస్తున్నారు. ఇందుకు రాజ్యసభ సభ్యుల నియామకమే ఉదాహరణ. 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయానికి చాలా మంది నాయకులు దోహదపడ్డారు. తలో చేయివేశారు. ఐదేళ్లుగా విపక్షంలో ఉన్నప్పుడు సైతం అధినేత జగన్ వెంట నడిచారు. పాదయాత్రలో పాలుపంచుకున్నారు. పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. అందరి కష్టంతో 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ తరువాత మాత్రం అధినేత జగన్ ముఖం చాటేశారు. పార్టీ ప్రయోజనాల కంటే తనకు కలిగే లాభాలను భేరీజు వేసుకొని పదవి పంపకాలు చేపడుతున్నారు. చివరికి పార్టీ పగ్గాలు సైతం నా అనుకున్న ఆ నలుగురికే కట్టబెట్టారు. తీరా ఇప్పుడు రాజ్యసభ స్థానాలను సైతం పారిశ్రామిక వేత్తలకే కట్టబెడుతున్నారు. గతంలో రిలయన్స్ కోటాలో పరిమళ నత్తానికి కేటాయించారు. ఇప్పుడు అదాని కోటలో ఆయన భార్య గౌతమ్ అదానీకి సీటు కట్టబెట్టే యోచనలో ఉన్నారు. ఆమె రాజ్యసభ సీటుపై ముచ్చట పడడంతో అదాని తన స్నేహితుడు జగన్ ను కోరారట. దీనికి సీఎం ఆమోదముద్ర వేశారని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అధినేత తీరు చర్చనీయాంశంగా మారుతోంది. కష్టపడి అధికారంలోకి తెచ్చిన నాయకులను వదిలి పారిశ్రామిక వేత్తల పిచ్చి పట్టకుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇది శ్రేణులకు తప్పుడు సంకేతమని హెచ్చరిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి చాలామంది నాయకులు త్యాగం చేస్తూ వచ్చారు. అటువంటి వారికి విధులు, నిధులు లేని కార్పొరేషన్ పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలు పార్టీతో సంబంధం లేని పెద్దలకు కేటాయించడంపై నేతలు కీనుక వహిస్తున్నారు. ఎంతో ఊహించామని.. ఇంతలా పరిస్థితి దిగజారుతుందని అనుకోలేదని వారు వాపోతున్నారు.
క్యూకడుతున్న నేతలు..
జూన్ లో రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అవన్నీ వైసీపీకే దక్కనున్నాయి. దీంతో తమకు చాన్సివ్వాలంటూ నేతలు అధినేతతో పాటు కీలక నేతల చుట్టూ తిరుగుతున్నారు. వారి ప్రాపకం కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతో రాజ్యసభ టిక్కెట్ల రేస్ వైసీపీలో రసవత్తరంగా నడుస్తోంది. రోజురోజుకూ పోటీ పెరుగుతోంది. గతంలో అధినేత మాట ఇచ్చిన వారు గుర్తుచేస్తున్నారు. కానీ ఆయన గుంభనంగా వ్యవహరిస్తున్నారు. మధ్యలో సినిమా రంగానికి చెందిన మోహన్ బాబు, అలీ, పోసాని క్రిష్ణమురళీలు సైతం మాకో చాన్స్ అంటూ ప్రయత్నిస్తున్నారు. అలీకైతే త్వరలో రాజ్యసభ అంటూ సంకేతాలు సైతం పంపారు. కానీ తరువాత సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతానికి నాలుగింట్లో ఒకటి తన సన్నిహితుడు భార్య గౌతమ్ అదానీకి కేటాయించినట్టు తెలుస్తోంది. మరొకటి విజయసాయిరెడ్డి రెన్యూవల్ రూపంలో పోతోంది. ఇంకా రెండు మిగిలాయి. ఆ రెండింటిపైనా చాలా మంది కళ్లుపడ్డాయి. కీలక నేత అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డితో పాటు కుమారుడ్ని కోల్పోయి విషాదంలో ఉన్న మేకపాటి ఆశలు పెట్టకున్నారు. కానీ జగన్ బయటపడడం లేదు. మూడు స్థానాలు రెడ్లకు ఇస్తే.. తాను ఎప్పుడు అస్త్రంగా వాడుకునే కుల రాజకీయం తెరపైకి వస్తుందన్న భయం జగన్ ను వెంటాడుతోంది. అందుకే పార్టీకి, తనకు పనికొచ్చే నాయకులకు చివరి నిమిషంలో బొట్టు పెట్టేస్తారన్న టాక్ వైసీపీ వర్గాల్లో ఉంది.
Also Read: AP Politics: టీడీపీ, జనసేనపై వైసీపీ నేతల ఫైర్… సింగిల్ ఫైట్ రాజకీయం
పారిశ్రామికవేత్తల నుంచి ఒత్తిడి
రాజ్యసభ పదవుల కోసం జగన్ కు పెద్ద స్థాయిలో పారిశ్రామిక వేత్తల నుంచి జగన్‌కు ఒత్తిళ్లు వస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ నుంచి మైహోం రామేశ్వరరావు కూడా వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కావాలంటేతాను వైసీపీలో చేరడానికి సిద్ధమని ఆయన చెబుతున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు జగన్‌కు పారిశ్రామికరంగం చాలా కాలంగా ఆప్తులుగా ఉండటమే కాదు బంధుత్వం కూడా ఉన్న హెటెరో పార్థసారధి రెడ్డి లాంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయాలకు రాక ముందు నుంచే జగన్ పారిశ్రామికవేత్త. జగన్‌కు సన్నిహితులైన పారిశ్రామికవేత్తలు చాలా మంది ఉన్నారు . వారంతా ఏదో విధంగా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో టీటీడీ బోర్డు లాంటి దాంట్లోనే చోటు కోసం వచ్చిన ఒత్తిళ్లు తట్టుకోలేక.. జీవో తెచ్చి మరీ వంద మందికిపైగా అందులో సభ్యత్వం ఇచ్చారు. ఇక రాజ్యసభ సీటు కోసం ఎంత వత్తిడి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజ్యసభ సీట్లను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీ అయినా భర్తీ చేస్తుంది.. కానీ వైసీపీ స్టయిలే వేరు
Also Read: Somu Veeraju: టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటే.. బీజేపీ స్టాండ్ ఏమిటి?
Recommended Videos: