KTR: హైదరాబాద్ ఫ్లై ఓవర్‌ను వాడుకోవద్దు.. బీజేపీ నేతల గూబ గుయ్యిమనిపించిన కేటీఆర్

KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తెలివైన అస్త్రం ప్రయోగించారు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ ద్వారా ఆ విషయం స్పష్టమవుతోంది. అప్పటి వరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న తెర్.. ఆ కాలంగాణ మంత్రి కేటీఆర్యక్రమం ముగిసిన తర్వాత బీజేపీకి షాకిచ్చినంత పని చేశారు. వివరాల్లోకెళితే.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో కలిసి తెలంగాణ మంత్రి కేటీఆర్, […]

Written By: Mallesh, Updated On : January 2, 2022 3:50 pm

Minister KTR

Follow us on

KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తెలివైన అస్త్రం ప్రయోగించారు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ ద్వారా ఆ విషయం స్పష్టమవుతోంది. అప్పటి వరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న తెర్.. ఆ కాలంగాణ మంత్రి కేటీఆర్యక్రమం ముగిసిన తర్వాత బీజేపీకి షాకిచ్చినంత పని చేశారు. వివరాల్లోకెళితే.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో కలిసి తెలంగాణ మంత్రి కేటీఆర్, నేతలు, అధికారులు హైదరాబాద్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

KTR:

ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ షేక్‌పేట్‌-రాయదుర్గం ఫ్లై ఓవర్‌ ప్రారంభం అనంతరం.. రాయదుర్గం వైపు నుంచి ఫ్లై ఓవర్‌ ఎక్కి షేక్‌పేట వైపు వెళ్లారు. ఇక జర్నీలో కేటీఆర్ వంతెనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీశారు. వాటిని తన ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో ఎస్‌ఆర్‌డీపీ ఇంజినీరింగ్‌ అధికారుల బృందం గొప్పగా కృషి చేసిందని కొనియాడారు. ఈ క్రమంలోనే బీజేపీకి సెటైర్ వేశాడు కేటీఆర్.

Also Read:  మొన్న ‘చీప్ లిక్కర్’.. నేడు ‘ఐటెం సాంగ్’.. ఏపీ బీజేపీకి ఏమైంది?

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో దయచేసి ఈ ఫొటోలను ప్రచారం కోసం వాడుకోవద్దంటూ బీజేపీ నాయకులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. దేశంలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ సోషల్ మీడియాను విస్తృతంగా వాడుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫ్లై ఓవర్ ఫొటోలను , ఆ రాష్ట్ర ఫొటోలుగా వాడొద్దని ఇన్ డైరెక్ట్‌గా సెటైరికల్ గా కేటీఆర్ ఇచ్చాడు.

ఇటీవల యూపీలోని యోగి ఆదిత్య నాథ్ సర్కారు ‘యూపీ మారుతోంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఫొటో కోల్‌కతా‌లో తృణమూల్ సర్కారు నిర్మించిన ఫ్లైఓవర్ ఫొటో అని వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని హైదరాబాద్ ఫ్లై ఓవర్ ఫొటోలను కూడా అలానే బీజేపీ వాడ్ చాన్సెస్ ఉన్నాయని కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు.

కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. కేంద్రమంత్రితో కలిసి ప్రారంభంలో ఉన్న కేటీఆర్ కార్యక్రమం ముగిసిన తర్వాత రాష్ట్ర మంత్రిగా తన బాధ్యత నిర్వర్తించారని ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కేటీఆర్ తెలంగాణ డైనమిక్ మినస్టర్ అని కొందరు పోస్టులు పెడుతున్నారు.

Also Read:  ‘భీమ్లా నాయక్’ రావాల్సిందే అంటున్న ఫ్యాన్స్.. సినిమా రిలీజ్ అప్పుడేనా?

Tags