https://oktelugu.com/

Mahesh Babu-Trivikram: మహేష్ కోసం త్రివిక్రమ్ ‘హెలికాప్టర్ల ఫైట్’ !

Mahesh Babu-Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడని వార్తలు రాగానే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడానికి త్రివిక్రమ్ అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. దాంతో భారీ సీన్స్ రాయాల్సి వస్తోంది. సహజంగా త్రివిక్రమ్ కి కొన్ని అలవాట్లు ఉన్నాయి. తన ప్రతి సినిమాలో తన అభిరుచికి తగ్గట్టు త్రివిక్రమ్ కచ్చితంగా ఓ భారీ ఫైట్ ను డిజైన్ చేస్తాడు. గమనిస్తే.. త్రివిక్రమ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 2, 2022 / 03:42 PM IST
    Follow us on

    Mahesh Babu-Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడని వార్తలు రాగానే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడానికి త్రివిక్రమ్ అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. దాంతో భారీ సీన్స్ రాయాల్సి వస్తోంది. సహజంగా త్రివిక్రమ్ కి కొన్ని అలవాట్లు ఉన్నాయి. తన ప్రతి సినిమాలో తన అభిరుచికి తగ్గట్టు త్రివిక్రమ్ కచ్చితంగా ఓ భారీ ఫైట్ ను డిజైన్ చేస్తాడు.

    Mahesh Babu-Trivikram

    గమనిస్తే.. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఓ ప్రత్యేక ఫైట్ సీన్ ఉంటుంది. పైగా ఆ సీన్స్ అన్నీ ట్రాఫిక్ తో పాటు చిన్నపాటి గ్రాఫిక్స్ ను మిక్స్ చేసి ఉంటాయి. ఇప్పుడు మహేష్ సినిమా కోసం కూడా త్రివిక్రమ్ ఇదే తరహా ఫైట్ ను ప్లాన్ చేశాడు. కానీ, ఈ సారి రోడ్డు మీద గాలిలో. రెండు హెలికాప్టర్ల మధ్య ఫైట్ ఉంటుందట. ఒకదానిలో హీరో – మరో దానిలో విలన్ ఉంటారని.. ఈ ఫైట్ చాలా ఖర్చుతో కూడుకున్నది అని తెలుస్తోంది.

    మొత్తమ్మీద, త్రివిక్రమ్.. మహేష్ సినిమా కోసం చాలా రకాలుగా ఆలోచిస్తున్నాడు. నటీనటుల ఎంపిక కూడా త్రివిక్రమ్ కి ఇప్పుడు అది పెద్ద సమస్య అయిపోయింది. ఒక పక్క ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ సినిమాలలో బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. మరి మహేష్ సినిమాలో కూడా పాన్ ఇండియా స్టార్స్ లేకపోతే బాగోదు అని డిస్ట్రీబ్యూటర్స్ ఇప్పటి నుంచే త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచుతున్నారు.

    Also Read: ఇండియా లో ఏ హీరోకి దక్కని ఘనత సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు…

    దాంతో బడ్జెట్ అనుకున్న దాని కంటే రెండితంతులు పెరిగే అవకాశం ఉంది. మరి నిర్మాతలు ఏ ధైర్యంతో ముందుకు పోతారో చూడాలి. ఇక ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని, అలాగే పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా చూపిస్తారట. ఓ సామాజిక అంశాన్ని కూడా సినిమాలో ప్రముఖంగా ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది.

    కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని, అందులో ఒక హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ పూజా హెగ్డేను ఫైనల్ చేశారని మొదట వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ పాత్రలో సమంతను ఫైనల్ చేశారట. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి మొదలుకానుంది.

    Also Read: ఆ సింగర్ కోసం మహేష్ పైరవీలు చేశాడట !

    Tags