DMK Congress Alliance: తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రకరకాల సమీకరణాలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం డీఎంకే అధికారంలో ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. డీఎంకే పార్టీ కాంగ్రెస్ లీడ్ చేస్తున్న ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది. త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు పలుకుతోంది.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పరాశక్తి సినిమా తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీ మధ్య చిచ్చు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలో 1965లో హిందీ వ్యతిరేక పోరాటం జరిగింది. నాడు ఆ పోరాటాన్ని అన్నాదురై చేపట్టారు. హిందీ వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నాడు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ కొనసాగుతున్నారు.
తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. తమకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదనే అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో లేదు. ఎందుకంటే గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకేకు బంపర్ మెజారిటీ వచ్చింది. ఏదోకూటమిలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో డిఎంకె దోస్తీ కొనసాగించింది. అందువల్లే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు డీఎంకే మంత్రి పదవులు ఇవ్వలేదు.
ఇటీవల సంక్రాంతి కానుకగా తమిళనాడు రాష్ట్రంలో పరాశక్తి అనే సినిమా విడుదలైంది. ఆ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించాడు. ఆ సినిమాలో అంశాలు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల బడ్జెట్ కు సంబంధించి ఓ న్యూస్ ఛానల్ లో చర్చ నడిచినప్పుడు.. పరాశక్తి సినిమా చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా డిఎంకే సంబంధించిన ఓ నాయకుడు హిందీ వ్యతిరేక ఉద్యమం గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆ న్యూస్ ప్రజెంటర్ కల్పించుకొని నాడు డీఎంకే హిందీ వ్యతిరేక ఉద్యమం చేసినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా అని అన్నారు. దీంతో డీఎంకే నాయకుడికి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఇక పరాశక్తి సినిమా లో చూపించిన కొన్ని సన్నివేశాలు కాంగ్రెస్, డీఎంకే మధ్య విభేదాలను పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు విజయ పార్టీతో గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాల్సి ఉందని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.