https://oktelugu.com/

షురూ అయింది: నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు మార్గం సుగమం కానుంది. రాష్ర్ట ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరిస్తోంది. ఆయా శాఖల్లో పోస్టులను జిల్లా (లోకల్) జోనల్, బహుళ జోన్ కేడర్లుగా గుర్తించింది. అత్యధిక శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు జిల్లా కేడర్, పలు శాఖల్లో సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్లు జోనల్ గ్రూపు-1 ఆ పైస్తాయి అధికారులు బహుళ జోన్లలో ఉంటారు. మొత్తం 84 విభాగాధిపతుల పరిధిలో ఉద్యోగాల వర్గీకరణను ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 7, 2021 / 10:46 AM IST
    Follow us on

    ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు మార్గం సుగమం కానుంది. రాష్ర్ట ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరిస్తోంది. ఆయా శాఖల్లో పోస్టులను జిల్లా (లోకల్) జోనల్, బహుళ జోన్ కేడర్లుగా గుర్తించింది. అత్యధిక శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు జిల్లా కేడర్, పలు శాఖల్లో సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్లు జోనల్ గ్రూపు-1 ఆ పైస్తాయి అధికారులు బహుళ జోన్లలో ఉంటారు. మొత్తం 84 విభాగాధిపతుల పరిధిలో ఉద్యోగాల వర్గీకరణను ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

    జిల్లా జోన్, బహుళ జోన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సచివాలయం, శాఖాధిపతుల పోస్టులు గతంలో రాష్ర్టస్థాయి కేడర్ లో ఉండేవి. కేడర్ ఖరారు కావడంత ప్రభుత్వం జిల్లాలు, జోన్లలో పనిచేస్తున్న ఉద్యోగులను సొంత జోన్లకు బదిలీ చేసే ప్రక్రియను ఆగస్టు నెలాఖరులో గా పూర్తి చేస్తారు. జనాభా ప్రాతిపదికపై ఒక్కో జిల్లాకు ఎన్ని పోస్టులుండాలి. ప్రభుత్వ శాఖల్లో ఎందరు అవసరమవుతారనే విషయాలను గుర్తిస్తారు. ప్రభుత్వం వద్ద ఉన్న ఖాళీల జాబితాను దీంతో పోలుస్తారు. అనంతరం ఖాళీలు లెక్కిస్తారు.

    ఉఫాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఏ కేడర్ పరిధిలోకి వస్తారో కూడా రాష్ర్ట ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుకు సంబంధించిన హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు పెండింగులో ఉన్నందున అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకుని రెండు మూడు రోజుల్లో వెల్లడించవచ్చు. ఎంఈవో, డైట్ అధ్యాపకులను బహుళ జోనల్ కేడర్ లో ఉంచినందున గెజిటెడ్ హెచ్ఎంలను కూడా అదే కేడర్ లో ఉంచాలని ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు రాజాభాను చంద్రప్రకాశ్ కోరారు.

    రాష్ర్టపతి ఉత్తర్వులను అనుసరిస్తూ జిల్లా, జోన్లు, బహుళ జోన్ల వారీగా ఉద్యోగాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం కేసీఆర్ కు టీఎన్జీవోలు, టీజీవోలు ధన్యవాదాలు తెలిపారు. దీని వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఈ సంఘాల నేతలు మామిళ్ల రాజేందర్, మమత, ప్రతాప్, సత్యనారాయణ తెలిపారు. ఖాళీల భర్తీ జరుగుతుందని తెలంగాణ వారికే ఉద్యోగాలు లభిస్తాయన్నారు.