Pawan Kalyan: ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని చూస్తారు. కేవలం డబ్బు సంపాదించడానికే రాజకీయాల్లోకి వచ్చిన వారు ఉన్నారు. ఆర్థికంగా స్థితిమంతులు, పారిశ్రామికవేత్తలు సైతం రాజకీయ బాట పడుతున్నారు. తమ అభివృద్ధి కోసం రాజకీయాలను ఒక ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉండడం ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. విపరీతమైన స్టార్ డమ్ ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. సినిమాల్లో తాను సంపాదిస్తున్నదంతా ప్రజల కోసం ఖర్చుపెడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతునే అటు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. సినిమాల్లో సంపాదించిన సొమ్మును మళ్లీ ప్రజలకే వినియోగిస్తున్నారు. అటు విపత్తులు, ఇటు ప్రభుత్వ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇతోధికంగా సాయపడుతున్నారు. ఇప్పడుతు తాజాగా ప్రభుత్వ విధ్వంసానికి నష్టపోయిన ఇప్పటం బాధితులు 53 మందికి రూ.లక్ష చొప్పున సాయం అందించనున్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ చేతుల మీదుగా ఇప్పటం బాధితులకు చెక్కుల పంపిణీకి పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి.

కౌలురైతు కుటుంబాల్లో వెలుగులు నింపిన నాయకుడు పవన్. చాలా మంది భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తుంటారు. ఉన్నఊరుని విడిచిపెట్టలేక.. ఉపాధి కోసం సుదూర ప్రాంతాలు వెళ్లలేక పెద్ద రైతుల వద్ద కొంత మొత్తం భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తారు. అయితే ఏటా వాతావరణ ప్రతికూల పరిస్థితులు, విపత్తులు, చీడపీడలు నష్టానికి గురిచేస్తున్నాయి. పెట్టుబడులు కూడా రాని దుస్థితి. అప్పులు తీర్చలేక..కుటుంబంతో బతకలేక చివరకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. అలాగని ప్రభుత్వాలు సాయం చేయడం లేదు. భూమి వారి పేరిట లేకపోవడమే ప్రధాన కారణం. దీనిని గుర్తించిన పవన్ కౌలురైతులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో 3 వేల మంది కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు గుర్తించారు. వారిని నేరుగా కలిసి రూ.లక్ష అందించేందుకు కౌలురైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను కోట్లాది రూపాయలతో ప్రత్యేక నిధిని సైతం ఏర్పాటుచేశారు. ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో యాత్ర పూర్తయ్యింది. త్వరలో ఉత్తరాంధ్రలో ప్రారంభంకానుంది.
జనసేన ఇప్పటివరకూ అధికారం చేపట్టలేదు. సంప్రదాయ పార్టీల మాదిరిగా విరాళాలు సేకరించలేదు. ఖర్చు తప్ప ఆదాయం ఎరుగని ఒకే పార్టీ జనసేన. ఆ పార్టీకి అండా, దండ అంతా పవనే. పార్టీ నిర్వహణ నుంచి బాధితులకు సాయం వరకూ అంతా పవన్ కష్టార్జితం నుంచి వస్తున్నదే. కొద్ది నెలల కిందట జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఇప్పటం గ్రామం వేదికగా నిలిచింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మందితో కార్యక్రమ నిర్వహణకు నిర్ణయించారు. ఇప్పటం గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామంలో 50 ఎకరాల పంట పొలాలను కార్యక్రమ నిర్వహణకు అప్పగించారు. ప్రభుత్వ పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా వారు పట్టించుకోలేదు. వారి ధైర్య సాహసాలకు మెచ్చిన పవన్ రూ.50 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తంతో గ్రామస్థులు ఒక కమ్యూనిటీ హాల్ ను నిర్మించుకున్నారు. కానీ ప్రభుత్వ పెద్దల కర్కశం నుంచి తప్పించుకోలేకపోయారు. రోడ్డు విస్తరణ పేరిట ప్రభుత్వం ఇళ్లను ధ్వంసం చేయడంతో మూల్యం చెల్లించుకున్నారు. దీనిపై పవన్ గట్టి పోరాటమే చేశారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఒక్కో బాధితుడికి రూ.లక్ష చొప్పన సాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఆదివారం అందించేందుకు నిర్ణయించారు.

జనసేన కోసం అహర్నిషలు శ్రమిస్తున్న జనసైనికుల కోసం బృహుత్తర పథకాన్ని సైతం పవన్ ప్రారంభించారు. వివిధ కారణాలతో చనిపోయినా, ప్రమాదాల్లో క్షతగాత్రులగా మారినా.. వారి కోసం ప్రత్యేక బీమా పథకాన్ని తన సొంత నిధులతో పవన్ ఏర్పాటుచేశారు. ఇప్పటివరకూ వందలాది మందికి కోట్లాది రూపాయలను బీమా పరిహారం కింద అందించిన గొప్ప నాయకుడు పవన్,. మొన్నటికి మొన్న విశాఖలో అన్ని ఇబ్బందుల నడుమ వివిధ కారణాలతో చనిపోయిన జన సైనికుల కుటుంబాలకు బీమా పరిహారాన్ని అందించి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ ఆవిర్భవించిన ఈ సుదీర్ఘ కాలంలో తన వందల కోట్ల సంపాదనను పార్టీ కోసం.. ప్రజల కోసం ఖర్చుచేశారు. బహుశా ఇటువంటి నాయకుడు దేశంలో ఎవరూ ఉండరనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.
. విపక్షాలు రకరకాల విష ప్రచారం చేసినా.. రాజకీయ ప్రత్యర్థులు ప్యాకేజీ నాయకుడంటూ ప్రచారం చేస్తున్నా వెరవడం లేదు. ప్యాకేజీలు తీసుకున్నాడని ఆరోపిస్తున్నది రాజకీయ నేతలే. ప్యాకేజీ ఇస్తున్నది రాజకీయ పార్టీలే అయినప్పుడు.. అందులో నిజముంటే ఈపాటికే అది బయటకు వెల్లడయ్యేది. పవన్ అంత నిజాయితీగా, నిబ్బరంగా ఉన్నారంటే అది ముమ్మాటికీ అవాస్తవమే. అయితే ఒకటి మాత్రం చెప్పగలం. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కు డబ్బు సంపాదనే ప్రాతిపదిక అయితే.. ఏడాదికి మూడు నాలుుగు సినిమాలు చేసుకొని వందల కోట్లు సంపాదించవచ్చు. హాయిగా తన స్టార్ డమ్ ను ఆస్వాదించవచ్చు. కానీ పవన్ మాత్రం ప్రజల బాటే పట్టారు. ప్రజల కోసం పరితపిస్తున్నారు. వారి కోసం వ్యయప్రయాసలకోర్చుతున్నారు. చివరకు రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ గా మిగులుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రజలు ఈ విషయాన్ని గుర్తిస్తున్నారు. పవన్ త్యాగనిరతికి, స్వార్థం లేని రాజకీయాలను చూసి టర్న్ అవుతున్నారు. తాను సంపాదిస్తున్న కోట్లాది రూపాయలను ప్రజలకే నేరుగా సాయం చేస్తుండడాన్ని విద్యాధికులు, మేధావులు సైతం సెల్యూట్ చేస్తున్నారు.
[…] […]