Prabhas: వరుస పరాజయాలు ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆందోళనకు కారణం అవుతున్నాయి. అనుభవం లేని డైరెక్టర్స్ తో సినిమా అంటేనే వారు భయపడుతున్నారు. సాహో, రాధే శ్యామ్ పూర్తిగా నిరాశపరిచాయి. సాహో కొంతలో కొంత పర్లేదు. కనీసం హిందీలో హిట్ అయ్యింది . రాధే శ్యామ్ టోటల్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రభాస్ కెరీర్లో అత్యధిక నష్టాలు మిగిల్చిన మూవీగా నిలిచిపోయింది. ఆదిపురుష్ తో ఆ రెండు పరాజయాలకు ప్రభాస్ సమాధానం ఇస్తారని ఫ్యాన్స్ భావించారు. అనేక ప్రత్యేకతలు ఉన్న ఆదిపురుష్ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేశారు.

అయితే టీజర్ విడుదలతో వారి ఆశలు ఆవిరయ్యాయి. హిట్ సంగతి దేవుడు ఎరుగు… అసలు మొత్తంగా పరువు పోతుందేమో అని ఆందోళన చెందుతున్నారు. అంత దారుణంగా ఆదిపురుష్ టీజర్ ఉంది. నాసిరకం విఎఫ్ఎక్స్, ఆకట్టుకొని పౌరాణిక గెటప్స్ తో కార్టూన్ మూవీని ఆదిపురుష్ తలపించింది. దానికి తోడు హిందూ సంఘాల నుండి వ్యతిరేకత. మొత్తంగా ఆదిపురుష్ మూవీపై ఆశలు గల్లంతు చేశాయి.
సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆదిపురుష్ చిత్రాన్ని మరో ఆరు నెలలు వాయిదా వేశారు. కొంతలో కొంత మెరుగైన అవుట్ ఫుట్ ఇచ్చేందుకు రిపేర్స్ చేస్తున్నట్లు సమాచారం. ఆదిపురుష్ విజయం సాధిస్తుందని అభిమానుల్లో ఏమాత్రం ఆశల్లేవు. జరిగిందేదో జరిగింది. ఇకపై జాగ్రత్తగా ఉండటం బెటర్ అని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మారుతితో మూవీ వద్దు అంటున్నారు. ఆ సినిమా క్యాన్సిల్ చేయండి, మీ ఇమేజ్ ని డీల్ చేయగల దర్శకులతోనే చిత్రాలు చేయండి అంటున్నారు.

హారర్ కామెడీ జోనర్ అని తెలిశాక మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ చేస్తున్న మరొక మిస్టేక్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. మారుతి ప్రాజెక్ట్ చేయకండని సీరియస్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక ప్రక్క మారుతి సినిమా ప్రీప్రొడక్షన్ పూర్తి చేసుకుని షూట్ కి సిద్ధం అవుతుందని వార్తలు వస్తున్నాయి. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని అంటున్నారు. ఫ్యాన్స్ ఎంత ప్రాధేయపడినా ప్రభాస్ బ్లైండ్ గా ముందుకు వెళుతున్నారని తెలుస్తుంది. అయితే ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాలపై ఫ్యాన్స్ లో అంచనాలు ఉన్నాయి.