BRS Leaders: ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్‌పై అసమ్మతి సెగ ఇప్పుడే చల్లారేటట్టు లేదు. అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా హరిప్రియనాయక్‌ను ప్రకటించిన నాటి నుంచి బీఆర్‌ఎస్ నేతల్లో కొందరు ఆమెను మార్చాలని పట్టుపడుతున్నారు. అయితే అభ్యర్థి మార్పునకే పట్టుబడుతున్న వారు వరుస సమావేశాలు నిర్వహిస్తోండటంతో ఇల్లెందు నియోజకవర్గంలో రాజకీయం కాకపుట్టిస్తోంది. తాజాగా.. ఆదివారం బీఆర్‌ఎస్ అసమ్మతి నేతలు మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని ఓ పంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌కు వ్యతిరేకంగా సమావేశమైయ్యారు. బయ్యారం పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి ఆధ్యక్షతన ఇల్లెందు మున్సిఫల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, బీఆర్‌ఎస్ జిల్లా నాయ కులు పులిగండ్ల మాధవరావు, ఎంపీపీలు నాగరత్నం, మౌనిక, పద్మ మల్సూర్, గార్ల పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, బయ్యారం ఎంపీటీసీ సభ్యురాలు తిరుమల శైలజరెడ్డి, సర్పంచ్ కోటమ్మ, ఉప సర్పంచ్ కవిత, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బత్తిని రాంమూర్తి, ఉపా ధ్యక్షుడు తిరుమల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవిలాల్, కృష్ణారావు, రవితో పలువురు స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. వారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
కాగా, ఎమ్మెల్యే హరిప్రియనాయక్ వైఖరికి నిరసగా ఇటీవల ఇల్లెందు నియోజకవర్గ వ్యాప్తంగా నేతలు, ప్రజాప్రతినిధులు మంత్రి హరీష్‌రావును కలిసిన సంగతి తెలిసిందే. హరిప్రియనాయక్‌కు బీ-ఫాం ఇవ్వొద్దని.. ఇస్తే సహకరించమని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో మంత్రి హరీష్‌రావు సీఎం కేసీఆర్ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాలని, పార్టీ అభ్యర్థి గెలుపునకు కలిసి కట్టుగా కృషి చేయాలని హితబోధ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అసమ్మతి నేతలు బయ్యారంలో సమావేశమవడం చర్చనీయాశంగా మారింది. ఇప్పటికైనా అధిష్టానం స్పందించి ఇల్లెందు అభ్యర్థిని మార్చాలని, హరిప్రియనాయక్‌కు టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితిల్లో సహకరించేది లేదని నేతలు మూకుమ్మడిగా అభిప్రాయపడ్డట్లు సమాచారం. అలాగే ఈనెల 5వ తేదీన గార్లలో సమావేశమైన అసమ్మతి నేతలు, తాజాగా బయ్యారంలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలస్తోంది. ఈ క్రమంలోనే ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో పలు సమస్యలపై కూడా నేతలు చర్చించినట్లు సమాచారం.