
తెలుగుదేశం పార్టీ ఇటీవల పార్టీ కమిటీలను ప్రకటించింది.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నేతలకు పదవులను అప్పజెప్పింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమిస్తూ తెలంగాణకు రమణనే యథావిధిగా ఉంచింది. అయితే ఏపీ పార్టీలో కొందరికి పదవులు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పోరాడుతూ అధికార పార్టీకి బలవుతున్నా తమకు అవకాశం ఇవ్వకపోవడంతో అసహనంతో ఉన్నారని చర్చ సాగుతోంది. అయితే ఇతరుల ద్వారా విషయం తెలుసుకున్న పార్టీ నేత చంద్రబాబు అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.
Also Read: టీడీపీ, వైసీపీ మోసాన్ని బయటపెట్టిన సోము వీర్రాజు
చంద్రబాబు ఇటీవల అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరుపున పోరాడుతున్నావారెవరు..? పార్టీకి దూరంగా ఉంటున్నవారెవరు..? అనే కోణంలో సమీక్ష నిర్వహించారు. పార్టీ కోసం పనిచేసేవారికి సరైన పదవులు అందించాలని, దూరంగా ఉన్నవారిని పక్కనబెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొందరు పదవులు దక్కని వారు పార్టీకి దూరంగా ఉండే అవకాశం ఉందని, అలాంటి వారు పార్టీని వీడినా ఫర్వాలేదనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు చోటు దక్కని సీనియర్ నాయకులను మాత్రం ఏదో రకంగా సర్ది చెప్పే పనిలో ఉన్నారు.
అయితే పార్టీ కోసం పోరాడుతున్న వారిలో అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి కట్టబెట్టామని చంద్రబాబు చెప్పారు. అధికార పార్టీ అచ్చెన్నాయుడిని ముప్ప తిప్పలు పెట్టినా వెనక్కి తగ్గలేదు. చివరికి జైలు జీవితం కూడా గడిపారు. అందుకే ఆయనకు అత్యున్నత పదవి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. అయితే గుంటూరు జిల్లాలోని అలపాటి రాజేందప్రసాద్, కృష్ణ జిల్లాలో దేవినేని ఉమామహేశ్వర్‌రావు లాంటి వారు పార్టీ కోసం పోరాడుతున్న పదవులు ఇవ్వలేకపోయామని బాబు చెప్పుకొచ్చారు. సమతూకం ఉండేలా కమిటీలను నియమించామని, అందుకే కొందరికి అవకాశం రాలేదన్నారు.
Also Read: జగన్ లేఖపై మరో ఆసక్తికర పరిణామం!
ఇక పార్టీ అధికార ప్రతినిథిగా ఉన్న పంచుమర్తి అనురాధ అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆమె కుటుంబ వ్యాపారంపై కన్నెర్ర జేసింది. అయినా తగ్గకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే ఆమెకు టీడీపీ నియామకాల్లో చోటు దక్కకపోవడంతో అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి సైతం తనకు పదవి దక్కలేదనే అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇలాంటి వారికి ఏదో ఒక పదవిలో సర్దుబాటు చేయాలని బాబు చూస్తున్నట్లు తెలుస్తోంది.