Discontents in YCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. ఎంపీ రఘురామకృష్ణంరాజు(ఆర్‌ఆర్‌ఆర్)లా రెబల్స్ నెమ్మదిగా తయారవుతున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెడుతున్నాయి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీ రెబల్ ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు. సాంకేతికంగా ఆయన వైసీపీలోనే ఉన్నా.. రెండేళ్ల క్రితమే ధిక్కార స్వరం వినిపించారు. తరచుగా పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, ముఖ్య సలహాదారు సజ్జల టార్గెట్‌గా ఆరోపణలు చేస్తున్నారు.

తాజాగా మరో నలుగురు..
ప్రస్తుత వైసీపీలో రఘురామకృష్ణంరాజులు పెరుగుతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పార్టీలో ఉంటూనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. వీరేకాకుండా ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ, ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, పార్టీకి రెబల్‌గా మారుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రెండో విడతలో మంత్రి పదవులు ఆశించి అవి దక్కనివారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నరు. అటువంటివారిని ముఖ్యమంత్రి జగన్ ఓ కంట కనిపెట్టాలని వైసీపీ నాయకులు సూచిస్తున్నారు.
కోటంరెడ్డిలాంటివారు ఎందరో..
తన నియోజకవర్గానికి ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించడంలేదరి ఎమ్మెల్యే కోటంరెడ్డి మురుగుకాల్వ డ్రెయినేజీలో కూర్చుకొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉంది కదా అని ప్రతిపక్షాలపై దాడులకు దిగితే ఆ తర్వాత వారు మనకు బుద్ధిచెబుతారని, అందరినీ సామరస్యంగా కలుపుకుపోవాలంటూ కొద్దిరోజుల క్రితమే ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: India vs England 5th Test: ఇంగ్లండ్ పై టీం ఇండియా ఓటమికి కారణాలు ఇవే
– రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అయితే ’ఈనాడు’ దినపత్రికను పొగుడుతూ.. ’సాక్షి’ దినపత్రికను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడమేకాదు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని అన్యాపదేశంగా పొగిడారు.

స్వరం వినిపించని అసంతృప్తులు ఎందరో?
ముఖ్యమంత్రి జగన్ మీట నొక్కి మంచి పేరు తెచ్చుకుంటున్నారని, నిధులు లేక తాము మాత్రం ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకుంటున్నామంటూ మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్‌గా మారాయి. మూడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నవారు వీరొక్కరే కాదని, వినిపించకుండా సైలెంట్ గా ఉన్నవారు కూడా ఎంతోమంది ఉన్నారని పార్టీ నాయకులే పేర్కొంటున్నారు.
ధిక్కార స్వరాలపై క్రమశిక్షణ చర్యలు?
నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయకపోవడంతో ప్రజల్లో తమమీద వ్యతిరేకత వ్యక్తమవుతోందనేది ఎమ్మెల్యేలందరి అభిప్రాయంగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే అన్ని నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయబోతున్నారు. అభివృద్ధి పనులు చేపట్టిన తర్వాత కూడా ధిక్కార స్వరాలు వినిపిస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. క్రమశిక్షణారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సహించలేది లేదని పార్టీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు హెచ్చరించారు.
Also Read: Kanyakumari MP Pen Lost: ఎంపీగారి పెన్ను పోయిందా? విచారణ చేస్తున్న పోలీసులు
[…] […]
[…] […]