CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ట్రాఫిక్ ఆంక్షలపై అవగాహన కొరవడుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఫలితంగా గంటల తరబడి రోడ్లపై నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిన్న సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు చేసిన హంగామాకు ప్రజలు బాధ్యులయ్యారు.దీంతో వారి అత్యవసర సేవలు దూరమయ్యాయి. ఈ క్రమంలో దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రోడ్ల మీద గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది.
ముందస్తు ప్రణాళికలు లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎంతకీ ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడంతో ఆస్పత్రులు, కార్యాలయాలకు, ఇతర అత్యవసర సేవలకు వెళ్లే వారు ఉత్కంఠకు గురయ్యారు. నిన్న సీఎం జగన్ శారదా పీఠం ఆశ్రమానికి వెళ్లేందుకు సిద్ధం కావడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో నగరంలోని పలు మార్గాలను దారి మళ్లించారు.దీంతోనే చిక్కులు వచ్చాయి.
సీఎం పర్యటనపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో సమస్యలు వచ్చాయి. ఉదయం 11 గంటలకు బయలు దేరాల్సి ఉండగా ఆయన 11.30 గంటలకు బయలుదేరారు. మధ్యాహ్నం 1 గంటలకు తిరుగు ప్రయాణం కావాల్సి ఉన్నా 4 గంటల వరకు అక్కడే ఉన్నారు. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధించడంతో ప్రజలు ఎటూ వెళ్లలేక సతమతమయ్యారు.
Also Read: CM Jagan: జగన్ ఇది నీకు తగునా? ప్రజలకు మూడు గంటల నరకం భావ్యమా?
అధికారుల్లో కొరవడిన సమన్వయం సీఎం జగన్ పర్యటనపై పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడంతోనే ట్రాఫిక్ నియంత్రణ సాధ్యం కాలేదని తెలుస్తోంది. ప్రజలు మాత్రం తమ అత్యవసర సేవలను వదులుకోవాల్సి రావడం గమనార్హం. సీఎం అయితే ట్రాఫిక్ ను ఇంత దారుణంగా మళ్లిస్తారా అని అందరిలో అనుమానాలు వచ్చాయి. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ పాలకులు ఇలా ప్రవర్తించడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.
సీఎం పర్యటనతో మూడు గంటల పాటు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల కొద్దీ ప్రజలు రోడ్డు మీదే నిలబడి ఉండిపోయారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మొత్తానికి జగన్ వల్ల తమ విలువైన సమయం కోల్పోయామని పలువురు పెదవి విరిచారు.
Also Read: AP CM Jagan: టాలీవుడ్ సినీ ప్రముఖులతో జగన్ ఏం మాట్లాడారు? ఏ హామీలిచ్చారో తెలుసా?