Homeజాతీయ వార్తలుZee News: బీజేపీ...

Zee News: బీజేపీ అనుకూల ఉద్యోగుల తొలగింపు.. మోడీ వార్తలు బంద్.. జీ న్యూస్‌లో ఏం జరుగుతోంది

Zee News: జాతీయ స్థాయిలో బీజేపీ అనుకూల మీడియాగా టౌమ్స్‌నౌ, రిపబ్లిక్‌ టీవీ, జీన్యూస్‌ ముందు వరుసలో ఉంటాయి. పార్టీకి అనుకూలమైన వార్తలను ప్రసారం చేయడంతోపాటు, ఆ పార్టీ నాయకులు నిర్వహించే కార్యక్రమాలు, సభలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటాయి. సర్వేల్లోనూ ఆ ఛానెళ్లు బీజేపీకి ఎడ్జ్‌ ఇస్తుంటాయి. అయితే సడెన్‌గా జీ న్యూస్‌లో బీజేపీ అనుకూల జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడుతున్నాయి. మోదీ, అమిత్‌షా ఎన్నికల ప్రచార సభలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడంలేదు. బీజేపీకి సంబంధించిన వార్తలు ఇవ్వడం లేదు. దీంతో జీ న్యూస్‌లో ఏం జరుగుతోంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కీలక ఉద్యోగుల తొలగింపు..
జీన్యూస్‌ యజమాని సుభాష్‌చంద్రగోయల్‌ నంరేంద్ర మోదీకి చాలా దగ్గర అన్న అభిప్రాయం మిగతా ఛానెళ్లు, పార్టీల్లో ఉంది. కానీ ఒక్కసారిగా బీజేపీ కార్యక్రమాలు నిలిపివేయడం, బీజేపీ అనుకూల ఉద్యోగల దొలగింపు చర్చనీయాంశమైంది. జీన్యూస్‌ సీఈవో అభయ్‌ వోజా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో డాక్టర్‌ ఇట్రిస్‌ లోహియాను నియమించారు. ఇక బీజేపీ అనుకూల, జాతీయవాద జర్నలిస్టుగా ఉన్న ప్రదీప్‌ భండారీ, జాతీయ వాద జర్నలిస్టుగా వెబ్‌సైట్‌ కూడా నడుపుతుంటారు. ఆయనను సెలవుపై వెళ్లాలని జీ యాజమాన్యం ఆదేశించింది. రెండు రోజుల క్రితం నరేంద్రమోదీ, అమిషా కార్యక్రమాలు ప్రసారం కావడం లేదు.

ఏం జరుగుతోంది…
జీన్యూస్‌లో వరుస పరిణామాలతో ఏదో జరుగుతోంది అన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. అయితే దీనిపై జీ యాజమాన్యం నుంచిగానీ, ఇటు బీజేపీ నుంచిగానీ, ఎలాంటి ప్రకటన రాలేదు. ఎన్నికల వేళ.. జీన్యూస్‌ బీజేపీతో తెగదెంపులు చేసుకుందా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని, హోం మంత్రితోపాటు, పార్టీ కార్యక్రమాల ప్రసారాలు నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Get notified whenever we post something new!

Continue reading

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. జియో ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. ఒక్కో వినియోగదారుడి నుంచి సగటున నెలకు...

BJP Strategy In UP: యోగీ మూడోసారి పక్కా.. యూపీలో బీజేపీ పెద్ద వ్యూహమిదీ

BJP Strategy In UP:  ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడం దేశవ్యాప్తంగా పాలనా అధికారం కోసం పోటీపడే ఏ పార్టీకైనా అత్యంత కీలకమైన మెట్టు. ఈ రాష్ట్రం 80 లోక్‌సభ స్థానాలతో దేశంలోనే అత్యధిక ప్రాతినిధ్యం కలిగి ఉంది. పశ్చిమ భారతదేశం మొత్తం కలిపినా ఇంతకంటే తక్కువ స్థానాలు ఉంటాయి. తూర్పు భారతదేశం సీట్ల సంఖ్యతో...

Narendra Modi: మోడీ దెబ్బకు మొత్తం మారిపోయింది

Narendra Modi: రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. నిన్నటి వ్యతిరేకులు ఈరోజు స్నేహితులుగా మారడం, వ్యతిరేక పార్టీలు చేతులు కలపడం సాధారణం. లోక్‌సభ, రాజ్యసభ స్వరూపం ఇప్పుడు గత సమావేశాల కంటే చాలా వేరుగా ఉంది. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ మారుతోంది, ఓటింగ్‌ సమీకరణలు మారుతున్నాయి. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు, డీలిమిటేషన్‌...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version