కరణం మల్లేశ్వరికి అరుదైన గౌరవం

మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఎక్కడ జరిగినా అక్కడ కరణం మల్లేశ్వరి పేరు వినిపిస్తుంది. ఒలంపిక్ పోటీల్లో కంచు పథకం సాధించిన ఈమెకు ఢిల్లీ ప్రభుత్వం అత్యున్నత గౌరవం ఇచ్చింది. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్స్ లర్ గా ఆప్ ప్రభుత్వం నియమించింది. దీంతో చాలా కాలం తరువాత కరుణం మల్లేశ్వరి పేరు వార్తల్లో నిలిచినట్లయింది. అయితే ఏపీకి చెందిన కరణం మల్లీశ్వరిని ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఢిల్లీ ప్రభుత్వం అందలమెక్కించడంతో తెలుగు రాష్ట్రాల్లో […]

Written By: NARESH, Updated On : June 23, 2021 4:06 pm
Follow us on

మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఎక్కడ జరిగినా అక్కడ కరణం మల్లేశ్వరి పేరు వినిపిస్తుంది. ఒలంపిక్ పోటీల్లో కంచు పథకం సాధించిన ఈమెకు ఢిల్లీ ప్రభుత్వం అత్యున్నత గౌరవం ఇచ్చింది. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్స్ లర్ గా ఆప్ ప్రభుత్వం నియమించింది. దీంతో చాలా కాలం తరువాత కరుణం మల్లేశ్వరి పేరు వార్తల్లో నిలిచినట్లయింది. అయితే ఏపీకి చెందిన కరణం మల్లీశ్వరిని ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఢిల్లీ ప్రభుత్వం అందలమెక్కించడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ సాగుతోంది.

2000 సంవత్సరంలో జరిగిన ఒలంపిక్స్ పోటీల్లో కరణం మల్లేశ్వరి కంచు పథకం సాధించారు. ఆంధ్రప్రదేశ్ లోని అముదాల వలసలో పుట్టిన ఈమె ఒలంపిక్స్ తో పథకం సాధించిన మొదటి భారత మహిళ గా నిలిచారు. అయితే అంతమకుముందే కరణం మల్లేశ్వరి ఆసియా వెయిట్ లిఫ్టింగ్, ఛాంపియన్ షిఫ్, ప్రపంచ ఛాంపియన్ షిప్ లో అనేక పథకాలు సాధించింది. దీంతో కరణం మల్లేశ్వరిని భారత ప్రభుత్వం పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బిరుదులతో సత్కరించింది.

ఒలంపిక్ పోటీల్లో మొదటి పథకం సాధించి భారత మహిళ గా రికార్డు సృష్టించిన కరణం మల్లేశ్వరిని భారత ప్రభుత్వం పలు సత్కారాలతో అభినందించడమే కాకుండా ఆమెను ఫుడ్ కార్పొరేషన్ ఆప్ ఇండియాలో చీఫ్ జనరల్ మేజేజర్ గా నియమించింది. ప్రస్తుతం ఆమె హర్యానాలోని యమునానగర్ లో భర్తతో కలిసి ఉంటున్నారు. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ మొదటి వైస్ ఛాన్స్ లర్ గా నియమించింది.

ఇతర అకడమిక్ డిగ్రీలతో సంబంధం లేకుండా వినూత్న విధానంతో ఈ యూనివర్సిటీ ఏర్పాటయింది. ఫ్యూచర్లో ఒలంపిక్ సాధించడమే లక్ష్యంగా ఈ యూనివర్సిటీ పనిచేస్తుంది. అలాంటి యూనివర్సిటీకి కరణం మల్లేశ్వరి మొదటి ఛాన్స్ లర్ గా నియమితులవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె పుట్టిన ఊరు ఆముదాల వలసలో సంబరాలు చేసుకుంటున్నారు.