Jagan- Telangana Ministers: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం పొందుతున్న రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ఫొటోలు దిగి సోదరుడితో సమావేశం బాగా జరిగిందంటూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టి తమ అనుబంధం గురించి తెలియజేయగా, తెలంగాణలో తాన్కొడినే కాపు మంత్రిని అని చెప్పుకుంటున్న పువ్వాడ అజయ్ మాత్రం జగన్ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై షాకింగ్ వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది స్టేట్ అయిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తాజాగా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దావోస్ పర్యటనను టార్గెట్ చేశారు.
కేటీఆర్‌పై పొగడ్తలు.. జగన్‌పై సెటైర్లు..
స్విట్జర్లాండ్ రాజదాని దావోస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఎకనామిక్ సదస్సుకు తెలంగాణ నుంచి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెళ్లగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి జగన్ వెళ్లారు. వారం రోజులుగా ఇద్దరూ వివిధ సంస్థల ప్రతినిధులను కలుస్తూ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ స్పందిస్తూ మంత్రి కేటీఆర్ పెట్టుబడులు తెస్తున్న తీరును ప్రశంసిస్తూ కేటీఆర్ తెలంగాణకు పెట్టుబడుల వరద పారిస్తుంటే.. పక్క రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరూ రాక, ఎవరు పెట్టుబడులపై ఆసక్తి చూపించక ఈగలు తోలుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో అడుగు పెట్టిన రోజే రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు తెచ్చారని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈగ వాలిన దాఖలాలు కూడా లేవని ఎద్దేవా చేశారు.
Also Read: 3 Years of Jagan Governance: జగన్ పాలనకు మూడేళ్లు.. ఎన్నో వివాదాలు.. సంక్షేమ ఫలాలు
పువ్వాడ వ్యాఖ్యల వీడియో వైరల్..
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యల వీడియో ఇప్పుడ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ఏపీ ప్రతిపక్ష టీడీసీ నాయకులు పువ్వాడ చేసిన వ్యాఖ్యలను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరువు తీస్తోంది. పక్క రాష్ట్రాల మంత్రులు ఏపీ సీఎం గురించి ఏం చెబుతున్నారో వినాలి అంటూ సెటైర్ వేస్తోంది. జగన్ విదేశాల్లో కూడా పరువు పోగొట్టుకున్నారని విమర్శిస్తున్నారు.
విదేశీ పెట్టుబడుల విషయంలో బీహార్‌తో పోటీ..
విదేశీ పెట్టుబడుల విషయంలో ఏపీ రోజురోజుకూ దిగజారి బీహార్‌తో పోటీపడుతోందంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో పెట్టుబడుల విషయంలో టాప్ ఫైవ్ లో ఏపీ ఉండేదని తాజాగా కేంద్రం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 14వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పడిపోయిందని .. జగన్‌ను ఒక ఫెయిల్యూర్ సీఎంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. జగన్ తనతోపాటు మంత్రులు అమర్నాథ్, మిథున్ రెడ్డిలను, అధికారులను తీసుకువెళ్తే.. మంత్రి కేటీఆర్ కేవలం అధికారులతో వెళ్లారని, అయినా తెలంగాణాతో పోల్చుకుంటే జగన్ పెట్టుబడులు తీసుకురావడంలో విఫలమవుతున్నారని విమర్శలు చేస్తోంది టీడీపీ. ఏపీలోని అరాచక పాలన చూసి పెట్టుబడులు పెట్టటానికి ఎవరూ ముందుకు రావటం లేదని విమర్శిస్తోంది.
Also Read:Power Cuts Again AP: మళ్లీ విద్యుత్ కోతలు..భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం