Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani: టీడీపీకి ఆయుధం దొరికినట్టేనా? మరి మంత్రి కొడాలి నాని పరిస్థితి ఏంటి?

Kodali Nani: టీడీపీకి ఆయుధం దొరికినట్టేనా? మరి మంత్రి కొడాలి నాని పరిస్థితి ఏంటి?

Kodali Nani: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం‌పై ఎలాంటి ఆరోపణలు వచ్చిన వాటికి సమర్థవంతంగా బదులివ్వడంలో ముందుంటారు మంత్రి కొడాలి నాని. కానీ ఆయన చంద్రబాబుకు కొరుకుడ పడని నేతగా మారారు. అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్న చంద్రబాబునే టార్గెట్ చేస్తారు నాని. మొదటి నుంచి నందమూరి ఫ్యామిలీకి చాలా సన్నిహితుడని ముద్ర వేసుకున్నారు నాని. ఆయనను పోయిన ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి దూరం చేయాలని ట్రై చేసినా అది సాధ్యం కాలేదు.

Kodali Nani
Kodali Nani

ఎందుకంటే ఆయనను పార్టీలకు అతీతంగా అభిమానించే వారు ఎక్కువగా ఉండటమే. గుడివాక కాన్స్‌టెన్సీలో కొడాలి నానిని పేరు పెట్టి పిలిచే వారు ఎక్కువగా కనిపిస్తారు. వీరందరూ ఏ సామాజిక వర్గానికి చెందిన వారైతే నేం.. నానిపై ఉన్న వ్యతిగత అభిమానంతోనే ఆయన వెంటే ఉంటారు. తనను అభిమానించే వారిని ఆయన ఎంతగా ప్రేమిస్తారో.. తనను వ్యతిరేకించే వారిని సైతం అంతే ధ్వేషిస్తూ ఉంటారు. దీంతో కొడాలి నాని తన నియోజకవర్గానికి తలనొప్పి మాదిరిగా తయారయ్యాడని చంద్రబాబు భావన.

Also Read: తగ్గేదేలే… క్యాసినో పాలిటిక్స్ తో హీటెక్కిన గుడివాడ.. టీడీపీ వర్సెస్ వైసీపీ

ముఖ్యంగా గుడివాడను దక్కించుకుంటే జిల్లాలోని మిగతా నియోజకవర్గాలు తమ చేతికి వచ్చినట్టేనని చంద్రబాబు ప్లాన్. దాని కారణంగానే నానిపై ఏ చిన్న విషయం ప్రచారమైన వెంటనే తన టీంను రంగంలోని దింపేస్తారు చంద్రబాబు. నానికి కరోనా సోకిందని.. ఆయన గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేశారనేది టీడీపీ నేతల ఆరోపణ. దీని కారణంగానే ఆయన సుమారు 500 కోట్లు సంపాదించాడనే విమర్శలకు దిగుతోంది టీడీపీ. మరి మూడు రోజుల్లో సుమారు రూ.500 కోట్లు సంపాదించడం సాధ్యమయ్యేపనేనా? అనే అనుమానాలు కలుగక మానవు. వాస్తవానికి గతనెల 6న కొడాలి నానికి కొవిడ్ సోకింది.

దీంతో ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నారు. అక్కడే వారం పాటు ఉన్నారు. పండగ తర్వాతనే ఆయన గుడివాడకు తిరిగి వచ్చారు. తన కన్వెన్షన్ సెంటర్‌లో అసలు క్యాసినోను ఏర్పాటు చేయలేదని, చేశానని నిరూపిస్తే సూసైడ్ చేసుకుంటానంటూ సవాల్ విసిరారు కొడాలి నాని. కానీ టీడీపీ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదలబోమని, కోర్టును ఆశ్రయిస్తామని చెబుతుండటం గమనార్హం. మంత్రి నానిని కట్టడి చేసేందుకు క్యాసినో అంశం టీడీపీకి ఆయుధంగా మారిందనే చెప్పొచ్చు.

Also Read: ద్యావుడా.. కొడాలి నాని బూతు బాగోతం వింటే ఖతమే.. ‘క్యాసినో’ నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని చస్తాడట.?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

3 COMMENTS

  1. […] Rashmi Gautam: యాంకర్  రష్మీ గౌతమ్ కి పెళ్లి అయిపోయింది.  లాక్ డౌన్ లో  రష్మీ   రహస్యంగా పెళ్లి చేసుకుని, హైదరాబాద్ లో కాపురం కూడా పెట్టింది.  ఓకేతెలుగు.కామ్ కి అందిన ఎక్స్ క్లూజివ్   సమాచారం ప్రకారం  రష్మీ గౌతమ్  ప్రస్తుతం  తన భర్తతోనే కలిసి ఉంటుంది.  అయితే, ఆమె భర్తకు సంబంధించి పూర్తి  వివరాలు ఇంకా  తెలియాల్సి ఉంది.  కాకపోతే, రష్మీ భర్త  సినిమా ఇండస్ట్రీకి  సంబంధం లేని వ్యక్తి అని,  అతను ఓ ప్రైవేట్  సంస్థలో మేనేజర్ అని తెలుస్తోంది.     […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular