Chandrababu: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయిన సంగతి అందరికీ విదితమే. ఇక ఇటీవల ఏపీ అసెంబ్లీ వేదికగా జరిగిన పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా, టీడీపీ చేతికి మరో అస్త్రాన్ని వైసీపీ అందించిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్నది.
గత ఎన్నికల్లో ఉద్యోగులు వైసీపీకి మద్దతు తెలిపారు. అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్, సీపీఎస్ రద్దు హామీలు ఇచ్చారు. అలా ఉద్యోగులు వైసీపీకి దగ్గరయ్యారు. అయితే, 27 శాతం ఐఆర్ వచ్చినప్పటికీ పీఆర్ సీ విషయంలో మాత్రం ఉద్యోగ సంఘలు,వైసీపీ సర్కారుకు మధ్య గ్యాప్ అయితే వచ్చింది. పీఆర్ సీ విషయంలో ఉద్యోగులను సీఎం జగన్ బుజ్జగిస్తున్నారనే వాదన ఉంది. కాగా, పెండింగ్ డీఏలు, 23 శాతం 23 శాతం ఫిట్ మెంట్‌తో కలిపితే వేతనం తగ్గదని ప్రభుత్వం వాదిస్తున్నది. అయితే, డీఏలతో కలిపి ఎలా పీఆర్ సీ గురించి చెబుతారంటూ ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
Also Read: వారానికో నేతను చేర్చుకుంటారంట.. వారిపైనే చంద్రబాబు ఆశలు..
అలా ఓ వైపున వివాదం కొనసాగుతున్న సమయంలోనే మరో వైపును ఏపీ కేబినెట్‌లో అధికారికంగా పీఆర్‌సీకి ఆమోద ముద్ర వేశారు. దాంతో ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయ. ఈ క్రమంలోనే ఉద్యోగులకు బుజ్జగించేందుకు సీఎం జగన్ సీనియర్ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. వీరు ఏ విధమైన చర్చలు జరుపుతారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. అయితే, జగన్ ను రాజకీయంగా దెబ్బతీసి ఉద్యోగ వర్గాన్ని తన వైపునకు ఈ సందర్భంలోనే మలుచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట.
ఉద్యోగుల సమ్మెకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని తెలుసుకుని ఆ దిశగా సాగాలని అనుకుంటున్నారట. వేతన సవరణ విషయంలో జగన్ ఉద్యోగులను తీవ్రంగా మోసం చేశాడని ఇప్పటికే చంద్రబాబు విమర్శించారు. అలా ఉద్యోగుల తరఫున పోరాటం చేసి వారిని టీడీపీ వైపునకు మరల్చుకునే ప్రయత్నాలపైన బాబు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read: చంద్రబాబు పెళ్లి పత్రిక వైరల్.. కట్నం ఎంత తీసుకున్నాడంటే?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Another weapon in the hands of tdp victory guarantee this time
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com