Panjshir: పంజ్ షీర్ ను తాలిబన్లు జయించారా? అక్కడేం జరుగుతోంది?

Panjshir: అఫ్గనిస్తాన్ లో పవర్ ప్రాంతమంటే పంజ్ షీర్ (Panjshir). అక్కడి ప్రజల పోరాట పటిమ ముందు ఎవరైనా తలవంచాల్సిందే. దశాబ్దాలుగా వారి జోలికి వచ్చిన వారిని ఎవరైనా సరే మట్టుబెడతారు. తమ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయిస్తే ఊరుకోబోమని తొడ గొట్టి మరీ హెచ్చరిస్తారు. అలాంటి ప్రాంతంపై తాలిబన్లు యుద్ధానికి తెగబడినా వారు మడమ తిప్పని పోరాట పటిమతో పోరాడతారు తప్ప వారికి లొంగరు. అలాంటి ప్రాంతంపై తాలిబన్లు కొత్త పాట అందుకుంటున్నారు. పంజ్ షీర్ తమ […]

Written By: Srinivas, Updated On : September 4, 2021 3:19 pm
Follow us on

Panjshir: అఫ్గనిస్తాన్ లో పవర్ ప్రాంతమంటే పంజ్ షీర్ (Panjshir). అక్కడి ప్రజల పోరాట పటిమ ముందు ఎవరైనా తలవంచాల్సిందే. దశాబ్దాలుగా వారి జోలికి వచ్చిన వారిని ఎవరైనా సరే మట్టుబెడతారు. తమ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయిస్తే ఊరుకోబోమని తొడ గొట్టి మరీ హెచ్చరిస్తారు. అలాంటి ప్రాంతంపై తాలిబన్లు యుద్ధానికి తెగబడినా వారు మడమ తిప్పని పోరాట పటిమతో పోరాడతారు తప్ప వారికి లొంగరు. అలాంటి ప్రాంతంపై తాలిబన్లు కొత్త పాట అందుకుంటున్నారు. పంజ్ షీర్ తమ వశమైందని ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీంతో దానికి వారు కూడా అంతే స్పందిస్తున్నారు. తమపై ఎవరి పెత్తనం అవసరం లేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పంజ్ షేర్ ప్రాంతంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

పంజ్ షీర్ మా ఆధీనంలోనే ఉందని తాలిబన్ ప్రతినిధి ఒకరు వెల్లడించడంతో ఈ ప్రకటనను అఫ్గనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఖండించారు. పంజ్ షీర్ తాలిబన్ల వశం కాలేదని చెబుతున్నారు. అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అఫ్గనిస్తాన్ జాతీయ తిరుగుబాటు దళం-విదేశీ వ్యవహారాల చీఫ్ నజరీ సైతం తాలిబన్ల ప్రకటనను ఖండించారు. అఫ్గాన్ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలను చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంజ్ షీర్ గడ్డపై పైచేయి సాధించాలనే తాలిబన్లు ప్రకటనలు చేస్తున్నారని చెబుతున్నారు. మరో వైపు తాలిబన్లను పంజ్ షీర్ దళం హతం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు 10 వేల మంది పంజ్ షీర్ ప్రాంతంలో తాలిబన్లతో తలపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పోరాటంలో ఎవరిది పైచేయి అన్నది ఇంకా తేలలేదని సమాచారం. ఇంతలోనే తాలిబన్లు పక్కదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారన్నారు.

అయితే తాలిబన్లకు అల్ ఖైదా మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాదంతో పోరాడుతున్న తమకు మద్దతు లేకపోవడం విచారకరమని వాపోతున్నారు. అఫ్గాన్ లో ఇప్పటికి కూడా తాలిబన్లకు వ్యతిరేకంగానే ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. తాలిబన్ల పాలనలో మహిళల హక్కులు కాలరాస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల పాలనను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కానీ తాలిబన్లు మాత్రం అరాచకాలకు పాల్పడుతూనే ఉన్నారు.