https://oktelugu.com/

ఎస్పీ బాలు నిన్న రాత్రే సీరియస్ అయ్యాడా?

ప్రముఖ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్య ఆస్పత్రిలో కన్నుమూశారు. సరిగ్గా ఈ మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఆయన చనిపోయారని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. Also Read: ఎస్పీ బాలుకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు కరోనా బారినపడిన ఎస్పీ బాలు ఆగస్టు 4న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్నా కూడా ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే బాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిపుణులైన వైద్యబృందం చికిత్స […]

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 / 07:16 PM IST
    Follow us on

    ప్రముఖ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్య ఆస్పత్రిలో కన్నుమూశారు. సరిగ్గా ఈ మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఆయన చనిపోయారని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

    Also Read: ఎస్పీ బాలుకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు

    కరోనా బారినపడిన ఎస్పీ బాలు ఆగస్టు 4న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్నా కూడా ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే బాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిపుణులైన వైద్యబృందం చికిత్స అందిస్తున్నా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు.

    నిన్నటి నుంచి ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఎక్మో, వెంటిలేటర్ పైనే ఉన్నారు. వైద్యులు శతవిధాలా ఆయనను కాపాడేందుకు కృషి చేశారు. ఎక్మో ట్రీట్ మెంట్ అంటే ఫైనల్ స్టేజ్ లోనే ఉన్నాడని.. అది కోమాలోనే ఉన్నట్టు.. అది తీసేస్తే ప్రాణం పోయినట్టే లెక్క. బాలు ఇక కోలుకోడని.. ఇక ఆయన బతకడని నిన్న రాత్రే వైద్యులు కూడా కన్ఫం చేసినట్టు తెలిసింది. ఈ మధ్యాహ్నం బాలు శాశ్వతంగా కన్నుమూశారు. దీంతో అధికారికంగా మధ్యాహ్నం 1.04కు బాలు చనిపోయాడని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు.

    అయితే నిజానికి ఎస్పీ బాలు నిన్న రాత్రే తుదిశ్వాస విడిచారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని డాక్టర్లు సైతం కుటుంబ సభ్యులకు చెప్పారని.. ఆ రకంగా మీడియాకు సమాచారం అందిందని సమాచారం.

    Also Read: గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చరిత్ర తెలుసా?

    అయితే సంప్రదాయాలు, ముహూర్తాలను బాగా నమ్మే ఎస్పీ కుటుంబం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఆయన మరణ వార్తను అధికారికంగా చెప్పాలని డిసైడ్ అయ్యారట.. అందుకే సరిగ్గా అదే సమయానికి ఎస్పీ చరణ్ మీడియా ముందుకు వచ్చి 1.04 గంటలకు నాన్న ఎస్పీ బాలు చనిపోయాడని చెప్పుకొచ్చారు. అయితే ఇది నిజమా? అబద్ధమా అన్న దానిపై క్లారిటీ లేదు.ఈ వార్తలపై ఎస్పీ బాలు కుటుంబం మాత్రం స్పందించలేదు.

    ప్రస్తుతం బాలు భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి పొడంబాకంలోని ఆయన స్వగృహానికి తరలించారు. రేపు అంత్యక్రియలు జరుగనున్నాయి.