
ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు అఖిల ప్రియకు సిఐడి విచారణకు హాజరవల్సిందిగా నోటీసులు జారీ చేసింది. శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ రాష్ట్రములో 8మంది అధికారులకు కరోనా రావడానికి కారణమయ్యారని,వైసీపీ ఎమ్మెల్యే లను చూసి అందరూ నవ్వుతున్నారని ఆమె కామెంట్ చేసింది. దీన్ని సీరియస్ గ తీసుకున్న హాఫిజ్ ఖాన్ సీఐడీ కు పిర్యాదు చెయ్యగా అఖిల ప్రియా తో పాటు మరో ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. అఖిల ప్రియ టీడీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పని చేసారు.