Mamata Banerjee- Chandrababu: జాతీయ స్థాయిలో చంద్రబాబు ప్రతిష్ట దిగజారిందా? ప్రధాన విపక్షాలేవీ ఆయనను పట్టించుకోవడ మానేశాయా? అసలు తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీ ఉందని మరిచిపోయారా? ప్రధానంగా చంద్రబాబు అంటేనే మమతా బెనర్జీ మండిపడుతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. అబ్ధుల్ కలాంను రాష్ట్రపతి చేసింది నేనే. దేవెగౌడను పీఎం చేసింది నేనే. లోక్ సభ స్పీకర్ గా బాలయోగికి అవకాశం కల్పించింది నేనేనంటూ బిల్డప్ ఇచ్చే బాబుకు తాజాగా విపక్ష కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికగాను నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆహ్వానం అందకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోనీ తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం అందినా చంద్రబాబుకు మాత్రం మొండిచేయి చూపారు. ‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయిస అనే సామెత చంద్రబాబు తాజా రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో విపక్షాల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌కు 17 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 22 పార్టీలను ఆహ్వానించినట్టు మమతాబెనర్జీ ప్రకటించారు. నిజానికి ముందు ప్రకటించిన జాబితాలో వైసీపీ లేదు. ఒక్క టీఆర్ఎస్ మాత్రం వుంది.
కేసీఆర్ ను ఆహ్వానించినా..
జాతీయ పార్టీ పెడతానని చర్చోపచర్చలు నిర్వహిస్తున్నతెలంగాణ సీఎం కేసీఆర్ విపక్షాల మీటింగ్‌కు గైర్హాజరయ్యారు. ఆ మధ్య పశ్చిమబెంగాల్‌కు వెళ్లి మమతతో కేసీఆర్ బృందం సమావేశమైన సంగతి తెలిసిందే. దేశంలో మోదీకి వ్యతిరేకంగా ప్రత్యా మ్నాయ కూటమి ఏర్పాటుపై కేసీఆర్ చర్చించి వచ్చారు. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలకు వెళ్లి కేసీఆర్ పలు పార్టీల నేతలతో చర్చించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయ కారణాలతో మమత భేటీకి వెళ్లలేదని కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించినందును ఆ పార్టీతో వేదిక పంచుకోనని తేల్చిచెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరం పాటిస్తానని కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో ఎపిసోడ్ ను కొంత వరకూ తెరదించారు. దీదీ ఆహ్వానాన్ని సుతిమెత్తగా తిరస్కరించారు.
Also Read: Center Govt- Agneepath Scheme: అగ్నిపథ్ పై కేంద్రం పీచేముడ్
జగన్ కూ లేఖ..
అయితే అప్పటి వరకూ వైసీపీకి అసలు సమావేశానికి ఆహ్వానమే అందలేదని ప్రచారం జరిగింది. వైసీపీని బీజేపీ పక్షంగా భావించి మమతా బెనర్జీ పక్కన పెట్టారన్న టాక్ నడిచింది. అయితే సమావేశం ముగిసిన తర్వాత వైసీపీని ఆహ్వానించినట్టు ఓ లేఖ తెరపైకి రావడం విశేషం. ఈ నెల 11న జగన్‌కు లేఖ రాసినట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “మన దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షం అవసరం. ఈ రోజు దేశాన్ని పట్టి పీడిస్తున్న విభజన శక్తుల్ని అడ్డుకోడానికి అన్ని ప్రగతిశీల పార్టీలూ కలిసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ నెల 15న రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం మీరు రావాలి” అని జగన్‌కు మమతాబెనర్జీ ఆహ్వానం పంపడం విశేషం.అయితే ఈ విషయంలో జగన్‌కు ఆహ్వానం రావడం విశేషమే. ఎందుకంటే మమతతో జగన్ ఎప్పుడూ స్నేహంగా మెలగలేదు.
టీడీపీకి దూరం..
తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలకంగా ఉన్న టీఆర్ఎస్, వైసీపీలకు ఆహ్వానం అందింది. ఇక మిగిలింది టీడీపీయే. అసలు చంద్రబాబుకు ఆహ్వానం అందకపోవడం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. . గత ఎన్నికలకు ముందు మమతతో కలిసి చంద్రబాబు జాతీయ స్థాయిలో చేసిన రాజకీయాలు అందరికీ తెలిసిందే. మోదీని చంద్రబాబు తిట్టని తిట్టు లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపాలు కావడంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. మోదీపై విమర్శ మాటేలేదు. మమత ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోలేనంతగా చంద్రబాబు భయపడుతున్నారు. దీంతో చంద్రబాబు నైజం తెలిసిన మమతాబెనర్జీ ఆయనపై మండిపడుతున్నారని సమాచారం.అందుకే జగన్‌ను ఆహ్వానించి, చంద్రబాబు స్థాయి ఏంటో చెప్పడానికి మమత పన్నిన వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రతిష్ట పూర్తిగా మసకబారిందనే సంకేతాలు పంపడానికే ఉద్దేశపూర్వకంగా ఆహ్వానం పంపలేదని సమాచారం. ఈ విధంగా బాబుపై మమతాబెనర్జీ ప్రతీకారం తీర్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంక్లిష్ట పరిస్థితులు..
వాస్తవానికి చంద్రబాబు ఇప్పుడు సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు ప్రతికూలంగా మారడంతో అచీతూచీ అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీని వదులుకొని భారీ మూల్యం చెల్లించుకున్నానని భావిస్తున్నారు. అందుకే గత మూడేళ్లుగా ఆ పార్టీకి దగ్గరయ్యే ఏ ఛాన్స్ వదులుకోవడం లేదు. పార్లమెంట్ లో తక్కువ సంఖ్యా బలమున్నా కీలక సమయాల్లో మాత్రం బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. అందుకే చంద్రబాబు పరిస్థితిని చూసి మిగతా విపక్ష నాయకులు కూడా చూసీచూడనట్టుగా ఉన్నారన్న టాక్ అయితే ఉంది. రాజకీయంగా కలిసివస్తే తప్పకుండా తమ వెంట వస్తారని భావిస్తున్నారు. అప్పటివరకూ చంద్రబాబును విడిచిపెట్టాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా నాలుగు దశాబ్దాల పైబడి రాజకీయ చరిత్ర, సుదీర్ఘ కాలం పాటు పాలనానుభవం ఉన్న చంద్రబాబు అనే నాయకుడొకరున్నారని జాతీయ నాయకులు మరిచిపోయినట్టున్నారు. అసలు టీడీపీ అనే ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఉందనే సంగతి జాతీయ నేతలకు గుర్తు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Also Read: China Military: చైనా ప్రమాదకర ఎత్తు.. భారత్‌సహా పొరుగు దేశాలకు ముప్పు!
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Did mamata banerjee take revenge nara chandrababu naidu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com