జగన్ కు మోడీని ప్రశ్నించేంత ధైర్యమొచ్చిందా?

ఏపీ సీఎం జగన్ లోనూ ధైర్యమొచ్చింది. ఏకంగా ప్రధాని మోడీని ప్రశ్నించేంతటి సాహసం చేశారు. మొన్నటికి మొన్న జార్ఖండ్ సీఎం సోరేన్ సోషల్ మీడియాలో మోడీని తిడితే కౌంటర్ ఇచ్చిన జగన్.. ఇప్పుడు సమస్య తనదాకా వచ్చేసరికి మోడీ తీరుపై ఘాటు లేఖ రాశారు. ప్రైవేటుకు టీకాలు ఇవ్వడం మంచిపద్ధతి కాదని ఏకంగా మోడీకి లేఖలో ప్రశ్నించారు. ఏపీలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. వేల కేసులు.. వందల మరణాలు సంభవిస్తున్నాయి. ఎంత ఆపుదామన్నా ఆగడం లేదు. ఓవైపు […]

Written By: NARESH, Updated On : May 22, 2021 7:14 pm
Follow us on

ఏపీ సీఎం జగన్ లోనూ ధైర్యమొచ్చింది. ఏకంగా ప్రధాని మోడీని ప్రశ్నించేంతటి సాహసం చేశారు. మొన్నటికి మొన్న జార్ఖండ్ సీఎం సోరేన్ సోషల్ మీడియాలో మోడీని తిడితే కౌంటర్ ఇచ్చిన జగన్.. ఇప్పుడు సమస్య తనదాకా వచ్చేసరికి మోడీ తీరుపై ఘాటు లేఖ రాశారు. ప్రైవేటుకు టీకాలు ఇవ్వడం మంచిపద్ధతి కాదని ఏకంగా మోడీకి లేఖలో ప్రశ్నించారు.

ఏపీలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. వేల కేసులు.. వందల మరణాలు సంభవిస్తున్నాయి. ఎంత ఆపుదామన్నా ఆగడం లేదు. ఓవైపు ఆక్సిజన్ కొరత.. టీకాల కొరతతో కేసులు పెరిగి నానా కష్టం అవుతోంది. కరోనా నియంత్రణకు టీకాలు వేయడమే పరిష్కారం. కానీ ఏపీలో టీకాల కొరత తీవ్రంగా ఉంది. 18-45 ఏళ్ల వారికి టీకాలు వేస్తామని ప్రకటించి జగన్ వెనక్కి తగ్గాడు. ఇక 45 ఏళ్ల పైబడిన వారికి టీకాలు ఇవ్వలేని దుస్థితికి ఏపీ సర్కార్ దిగజారింది. దీనంతటికి మోడీ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఏపీ సీఎం జగన్ తన అసహనాన్ని అంతా లేఖలో వెల్లడించాడు.

ఏపీలో కరోనా నియంత్రణ టీకాల కొరత వేధిస్తోందని ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కానీ సరిపడా టీకాలే లేవని జగన్ తన అసహయతను వెల్లడించాడు. 45 ఏళ్లు పైబడిన వారికే టీకాలు వేయడానికి లేవని.. ఇక 18-45 ఏళ్ల వయసు వారికి టీకా ప్రక్రియనే ప్రారంభించలేకపోతున్నామని మోడీ దృష్టికి జగన్ తీసుకెళ్లారు.

దీనంతటికి కారణంగా ప్రైవేటు ఆస్పత్రులకు టీకా ఇవ్వడమేనని జగన్ స్పష్టంగా లేఖలో మోడీ నిర్ణయాన్ని ప్రశ్నించారు. ప్రైవేటులో టీకా ధరలు దారుణంగా వసూలు చేస్తున్నారని.. ఒక్కో డోసుకు రూ.2వేల నుంచి రూ.25వేలు తీసుకుంటున్నారని జగన్ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా విపత్తులో ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా తప్పుడు సంకేతాలను ప్రజలకు ఇస్తోందని.. టీకాలపై ప్రభుత్వం నియంత్రణ లేకుంటే టీకాలు నల్లబజారుకు తరలిస్తారని జగన్ తన ఆందోళనను మోడీకి లేఖలో వ్యక్తం చేశారు.

సూటిగా.. సుత్తిలేకుండా వ్యాక్సిన్ల కొరత దేశంలో ఇంతలా వేధిస్తుంటే మీరు ప్రైవేటుకు ఎలా ఇస్తారని ప్రధాని మోడీని జగన్ ధైర్యం చేసుకొని ప్రశ్నించడం విశేషం. దీని వల్ల సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని మోడీకి వివరించారు. దీన్ని వెంటనే మార్చి ప్రభుత్వాలే ప్రజలకు ఉచితంగా పంచేలా మార్గదర్శకాలు పంచాలని జగన్ డిమాండ్ చేయడం విశేషం.

ఇలా ఇన్నాళ్లు మోడీపై ఈగవాలనీయకుండా కాపుకాసిన జగన్ ఇప్పుడు ఏపీలో పరిస్థితులు టీకా కొరత చూసి స్వయంగా మోడీ సర్కార్ తీరును ఎండగడుతూ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది.