Netizens Fire on Mohan Babu: మంచు మోహన్‌బాబు సినిమాల్లో విలక్షణమైన నటుడు. విలన్‌గా, హీరోగా ప్రత్యేకత చాటుకున్న ఆయన.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తనదైన శైలిలో రాణించారు. రాజకీయాల్లో కూడా మోహన్‌బాబు తనదైన ముద్ర వేశారు. టీడీపీ హయాంలో రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. అయితే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుతో కొన్ని విభేదాల కారణంగా వైసీపీలో చేరారు. జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు.
ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన జాతీయ సాంస్కృతిక మహోత్సవ కార్యక్రమంలో మోహన్‌బాబు పాల్గొన్నారు. ఇదే వేదికపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1998లో తాను ప్రచారం చేయడం వల్లే బీజేపీకి 18 శాతం ఓట్లు వచ్చాయన్నారు.
Also Read: ప్రజల మూడ్ మార్చేద్దాం.. ఉత్తరాంధ్ర వాసుల్లో సెంటిమెంట్ రగిల్చే పనిలో ప్రభుత్వం
అయితే హీరో మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు కామెడీగా ఉన్నాయని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది. అసలు రాజకీయాల్లో మోహన్‌బాబుకు ఏమంత ఫాలోయింగ్ ఉందని ఆయన ముఖం చూసి ప్రజలు ఓట్లేస్తారని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. అంత ఫాలోయింగ్ ఉన్నవాడే అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి సత్తా చూపాలని హితవు పలుకుతున్నారు.
మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలకు కిషన్‌రెడ్డి, సోము వీర్రాజు మనసులో పడిపడి నవ్వుకుని ఉంటారని నెటిజన్‌లు ఛలోక్తులు విసురుతున్నారు. ఇదే సభపై మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయన మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలకు షాక్ తిన్నారు. అంతేకాకుండా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మోహన్‌బాబు జేజేలు కొట్టించడంపైనా విస్తుపోయారు. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్‌బాబు వైసీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
Also Read: బిగ్‌బాస్ ఓటీటీ: 4వ వారం ఎలిమినేట్ ఎవరంటే..?