ఏపీ రైతులకు లబ్ధి చేకూరిందా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ప్రభుత్వ పాలన ప్రారంభమై రెండేళ్లు అవుతున్న సందర్భంగా ఎవరికి ఎంత మేలు చేశామో అని మీడియాకు సమాచారం ఇస్తోంది. రెండేళ్లలో రూ.80 వేల కోట్లు అందజేశామని చెబుతోంది. అన్నిపథకాల కింద రూ.85 వేల కోట్లు ఇచ్చామని, దీంతో వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాయని చెబుతోంది. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులుగా చేర్చిన కుటుంబాల సంఖ్య దాదాపుగా 55 లక్షల వరకు ఉంటుంది. రైతు భరోసా కింద నగదు బదిలీని ఆ యాభై […]

Written By: NARESH, Updated On : May 24, 2021 12:07 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ప్రభుత్వ పాలన ప్రారంభమై రెండేళ్లు అవుతున్న సందర్భంగా ఎవరికి ఎంత మేలు చేశామో అని మీడియాకు సమాచారం ఇస్తోంది. రెండేళ్లలో రూ.80 వేల కోట్లు అందజేశామని చెబుతోంది. అన్నిపథకాల కింద రూ.85 వేల కోట్లు ఇచ్చామని, దీంతో వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాయని చెబుతోంది.

రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులుగా చేర్చిన కుటుంబాల సంఖ్య దాదాపుగా 55 లక్షల వరకు ఉంటుంది. రైతు భరోసా కింద నగదు బదిలీని ఆ యాభై ఐదు లక్షల కుటుంబాలకే అందించారు. ఏటా రూ.75 వేలు ఒక్కో రైతు కుటుంబానికి అందుతున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. నిజానికి ఈ సొమ్ము ద్వారా రైతుల కష్టాలు తీరిపోతాయని అనుకోవచ్చు.

ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి రూ.75 వేలు అందుతున్నాయా? రెండేళ్లలో రూ.1.50 లక్షలు ఒక్కో కుటుంబం అందుకుందా? ప్రభుత్వం చె ప్పే లెక్కలు నిజమేనా అన్న దానిపై చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రైతు భరోసా కింద రైతులకు రూ.7500 మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. మూడు విడతలుగా కేంద్రం ఇచ్చే రూ.6 వేలను తమ ఖాతాలో వేసుకుని రూ.13,500 అని లెక్క చెబుతోంది. అందుకే రూ.7500 మాత్రమే లెక్కించాలి. మేనిఫెస్టోలో ఉచిత బోర్ల పథకం దగ్గర్నుంచి అనేక పథకాలు ప్రారంభించినా అమలైన దాఖలాలు లేవు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం రైతులు పండించిన ధాన్యం కొనడం కూడా లబ్ధిగానే చెబుతున్నారు. వరి పండించే రైతులకు రూ.27,028 కోట్లు, ఇతర పంటలకు రూ.5,964 కోట్లతో గిట్టుబాటు ధర కల్పించామని చెబుతోంది. రతులు కష్టపడి పండించిన పంటను గిట్టుబాటు ధరలో కొనుగోలు చేయడం కూడా లబ్ధిగానే ప్రభుత్వం చెప్పుకుంటోంది. సున్నా వడ్డీ పథకం కింద రూ.1261 కోట్లు, ఉచిత పంటల బీమా పథకం కింద రూ.4113 కోట్లు చెల్లించామని చెబుతోంది.